ఫొటో రైటప్: బాధితుల సమస్యలను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లకు వివరిస్తున్న వ్యాస రచయిత
ప్రభుత్వాన్ని నిలదీస్తున్న GO 72, ల్యాండ్ పూలింగ్ బాధితులు. మే 15 సోమవారం అనకాపల్లిలో భారీ ప్రదర్శన నిర్వహించిన బాధితులు
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం దళిత బహుజన పేదలు తమకు ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. ఇది గొంతెమ్మ కోరిక ఏమీ కాదు. ప్రభుత్వము ఒక GO ద్వారా ఈ హామీ ఇచ్చింది. ఆ GO సంఖ్య జనవరి 25, 20 20 పట్టణ అభివృద్ధి శాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ఇది.
అనకాపల్లి మండల పరిధిలో గత ప్రభుత్వాలు ఇచ్చిన డి-ఫారం పట్టా భూములను ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించడం కోసం ఈ GO ను ఇచ్చింది.
Also read: వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి ఆదివాసీలకు విముక్తి, పట్టా చేతికి వచ్చిన గంటకే ప్రాణం పోయింది!
సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం అనకాపల్లి మండలంలో 14 రెవిన్యూ గ్రామాలలో ప్రభుత్వము 1008.94 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించింది. ఇందులో 621. 54 ఎకరాలు డి-ఫారం పట్టా భూములు. వీటి యజమానులు అందరూ పేద వర్గాలకు దళిత బహుజన సామాజిక వర్గాలకు చెందినవారు. 379.33 ఎకరాలు 10 సంవత్సరాలకు పైగా సాగు అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములు. అయితే, సాగుదారుల వద్ద పట్టాలు లేవు. ఇక మరొక ఎనిమిది ఎకరాలు 5 సంవత్సరాల లోపున సాగు అనుభవంలో ఉన్న భూమి. ఇలా సేకరించిన భూమిలో 48 చదరపు గజాల ఒక సెంటు పట్ట ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పేదల నుండి తీసుకున్న భూములకు గాను పట్టా ఉన్న భూమికి ఎకరాకి 18 సెంట్లు, 10 సంవత్సరాలకు పైబడి సాగు అనుభవంలో ఉండి పట్టా లేకపోతే అందులో సగం అనగా తొమ్మిది సెంట్లు పూర్తి జరాయితి హక్కులతో, అమ్ముకోవడానికి ఎలాంటి ఆటంకమూ లేకుండా, వ్యవసాయక భూమిని వ్యవసాయతర భూమి కేటగిరీగా మార్చి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి పేదల దగ్గర నుండి ఈ భూములను సేకరించింది. ప్రభుత్వం భూములు సహకరించే నాటికి వీటన్నింటిలో సాగుదారులు పెంచిన జీడి మామిడి తోటలు ఉన్నాయి. వాటి నుండి ఎకరాకు ఎంత తక్కువ చూసుకున్న సంవత్సరానికి రూ. 15000ల వరకూ ఆదాయం వచ్చేది. భూములు తీసుకునే సమయంలో ప్రభుత్వం భూమిలో ఉన్న జీడి తోటలకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అయినా సాగు అనుభవదారులు ప్రభుత్వానికి సహకరించి జీడి తోటలతో సహా తమ భూములను అప్పగించారు. బదులుగా ప్రభుత్వం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సంతకంతో ప్రతివారికి ధ్రువపత్రాలు ఇప్పించింది.
అయితే ఇది జరిగి నాలుగు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈనాటికీ వారికి ఇస్తామన్న ప్రత్యామ్నాయ భూమి విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆసక్తిని చూపించటం లేదు.
Also read: భూమి ప్రశ్న – భు పరిపాలనలో వస్తున్న మార్పులు
మరోవైపున తమ గ్రామంలో తమ నుండి సేకరించిన తమ భూమిలో సెంటు పట్టా లేఅవుట్లు వేసి స్థానికేతర లబ్ధిదారులను తీసుకొని వచ్చి వాటిని అప్పగిస్తున్నారు. దీంతో భూములు పోయినవారు తీవ్ర ఆందోళనకూ, ఆగ్రహానికీ గురవుతున్నారు. కొన్నిచోట్ల సెంటు పట్టా లబ్ధిదారులను అడ్డుకుంటున్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించి భూములు ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయ భూమిని అప్పగించడం గాక జిల్లా యంత్రాంగం పోలీసు దళాలను పంపించి ప్రత్యామ్నాయ భూములు అడుగుతున్న వారిపై దౌర్జన్యానికి దిగుతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి. అసలు ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చే ఉద్దేశం ఉన్నదీ, లేనిదీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం మంచిది.
గత నెల ఏప్రిల్ 26న గాంధీయ పద్ధతిలో బాధితులు ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించి అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కాలం గడుస్తున్న రెవెన్యూ అధికారుల నుండి చలనం లేదు.
ఈ రోజు అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతృత్వంలో అనకాపల్లి పురవీధులలో భారీ నిరసన ప్రదర్శనను ల్యాండ్ పూలింగ్ బాధ్యతలు నిర్వహించారు.
Also read: అప్పుల ఉచ్చులో ‘రొచ్చుపనుకు’ ఆదివాసీ రైతులు