- రిహానా, ధన్ బర్గ్ మద్దతు
- రైతుల ఆందోళనపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకారం
ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. చట్టాల రద్దుకు ఉద్యమం చేపట్టిన రైతులకు ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్ సంఘీభావం తెలిపారు. ఈ మేరకు రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలను ప్రస్తావిస్తూ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
మనం మౌనంగా ఎందుకున్నాం–రిహానా
అంతర్జాతీయ పాప్ సింగర్ రిహానా కూడా రైతులు చేస్తున్న ఉద్యమంపై ట్విటర్ వేదికగా స్పందించారు. ట్రాక్టర్ల ర్యాలీ ని కూడిన ఫొటోను జతచేసిన రిహానా రైతుల ఉద్యమంపై మనమెందుకు మాట్లాడటం లేదని ట్వీట్ చేశారు. రిహనా చేసిన ట్వీట్ ట్వటర్ లో వైరలో అవుతోంది. ఆమె చేసిన ట్వీట్ వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.
అయితే రిహానా ట్వీట్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. ఆమె చేసిన ట్వీట్ ను ఉదహరిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తోంది రైతులు కాదు ఉగ్రవాదులు కాబట్టి మాట్లాడటం లేదని అన్నారు. దేశాన్ని మరోసారి విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
రైతుల ఆందోళనపై రాజ్యసభలో చర్చ
మరోవైపు సాగుచట్టాలపై రైతుల చేస్తున్న ఆందోళనపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఒడంబడిక కుదిరింది. రాజ్యసభలో 15 గంటలపాటు చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. శుక్రవారం దీనిపై చర్చ జరిగే అవకాశమున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇదీ చదవండి: మడమ తిప్పం…వెనక్కి తగ్గం
ట్రాక్టర్ ర్యాలీలో హింసపై ఇవాళ సుప్రీంలో విచారణ:
గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై దాఖలైన పిటీషన్లను సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణ్యన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ట్రాక్టర్ ర్యాలీలో వేలాది మంది ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టి, పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఎర్రకోటలో జాతీయ జెండాను తొలగించి ఒక మతానికి చెందిన ఎగురవేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పలు పటీషన్లు దాఖలయ్యాయి.