- అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు విషయంలో రూ. 20వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సోమవారంనాడు అనుమతి ఇచ్చింది. ‘‘వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారు. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారు. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్లకు బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తాం’’ అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు వివరించింది.
Also Read: అగ్రిగోల్డ్ పునరుద్ధరణ ఎప్పుడు?
మార్చి 31నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయగా.. బదిలీ చేసే పాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
అలాగే అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయగా.. బదిలీ చేసే పాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని, వెంచర్ల ద్వారా నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తి బకాయిలు చెల్లించడానికి అనుమతి కోరుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం దాఖలు చేసిన పిటీషన్ వచ్చే గురువారం విచారణకు రానుంది.