- ముగ్గురు భారత అంపైర్లతో ఇంగ్లండ్ తో సిరీస్
- ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో తొలిటెస్ట్ మ్యాచ్
కరోనావైరస్ దెబ్బతో తటస్థ అంపైర్ల విధానానికి ఐసీసీ తాత్కాలికంగా విరామం ఇచ్చింది. వివిధ దేశాలకు చెందిన విఖ్యాత అంపైర్లతో కూడిన ఎలైట్ ప్యానెల్ తో అంతర్జాతీయ సిరీస్ లు నిర్వహిస్తూ వస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి కోవిడ్ హెచ్చరికల నేపథ్యంలో భారత్- ఇంగ్లండ్ జట్ల సిరీస్ కు భారత్ కే చెందిన ముగ్గురు అంపైర్ల బృందాన్ని ఎంపిక చేసింది. చెన్నై, అహ్మదాబాద్ నగరాలు వేదికలుగా ఫిబ్రవరి 5 నుంచి జరిగే నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ కు చెందిన వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి,నితిన్ మీనన్ ల జట్టు నిర్వహించనుంది.
ఇదే మొదటిసారి:
ఇది చదవండి: భారత క్రికెటర్లకు కోవిడ్ పరీక్షలు
అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లను గత కొద్ది సంవత్సరాలుగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లతో నిర్వహిస్తూ వస్తున్నారు. సాధారణంగా తటస్థదేశాల అంపైర్లే విధులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా వైరస్ దెబ్బతో కొద్దిమాసాలపాటు అంతర్జాతీయ క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కోవిడ్ నిబంధనలు తుచతప్పక పాటిస్తూ ఖాళీ స్టేడియాలలోనే మ్యాచ్ లు నిర్వహించడం తిరిగి ప్రారంభించారు. అయితే..భారతతో ఇంగ్లండ్ తలపడే ఐసీసీ టెస్ట్ చాంపియణ్ షిప్ లీగ్ సిరీస్ కు మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి మినహాయింపు ఇచ్చింది.
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ఉన్న ఈ కీలక సిరీస్ కు ముగ్గురూ భారత అంపైర్లనే నియమించడం విశేషం. ఇందులో ఇద్దరు అంపైర్లు టెస్టు అంపైర్లుగా అరంగేట్రం చేయనున్నారు. ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌లో ఉన్న వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ చేయనున్నారు. వీళ్లకు ఇండియా ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ కూడా జత కలవనున్నాడు. నితిన్‌కు గతంలో టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన అనుభవం సైతం ఉంది. కరోనావైరస్ స్ట్రెయిన్స్ భయం కారణంగా అంతర్జాతీయ రాకపోకల సమస్యలు ఉండటంతో టెస్ట్ చాంపియన్ షిప్‌లో స్థానిక అంపైర్లనే నియమించే అవకాశం ఐసీసీ కల్పించింది.
ఇది చదవండి: భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్
భలే చాన్సులే:
ఐసీసీ నిబంధనల సడలింపుతో ఇప్పుడు భారత అంపైర్లకు అనుకోని అవకాశం దక్కింది. నిజానికి ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో భారత్ నుంచి ఒకే అంపైర్ ఉన్నారు. భారత్, ఇంగ్లండ్ సిరీస్ అంపైర్లలో నితిన్ మీననే సీనియర్ గా ఉన్నారు. నితిన్ కు మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ చేసిన రికార్డు ఉంది. మరోవైపు వీరేందర్ శర్మ కేవలం రెండు వన్డేలు, ఒక టీ20లోనే అంపైరింగ్ చేయగా చౌదరి 20 వన్డేలు, 28 టీ20ల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైరింగ్ చరిత్రలో ముగ్గురు భారత అంపైర్లు కలసి భారత గడ్డపై జరిగే సిరీస్ ను నిర్వహించనుండడం కూడా ఓ రికార్డుగా మిగిలిపోనుంది.
ఇది చదవండి: కెప్టెన్ గా విరాట్ కొహ్లీ స్టయిలే అంత…!