- పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా హామీ
- దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్
రామగుండం కమిషనరేట్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్, పోలీస్ గెస్ట్ హౌస్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మున్సిపల్ కమీషనర్ ఉదయ్ కుమార్ తో కలిసి పరిశీలీంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు సత్వర సేవలు అందించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అన్ని హంగులతో భవన నిర్మాణాలు చేపట్టిందని అన్నారు. పోలీస్ స్టేషన్, పోలీస్ గెస్ట్ హౌస్ సముదాయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హోసింగ్ అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ కంట్రోల్ గా ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ కు ఉన్న పరిధిని బట్టి హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఏ మాత్రం తీసిపోదని అన్నారు. అధునాతన హంగులతో మోడల్ పోలీస్ స్టేషన్ కట్టాలనే సదుద్దేశంతో కార్పొరేట్ స్థాయిలో ఈ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కోలేటి దామోదర్ ఎంతో కృషి చేశారని సీపీ అన్నారు. నూతన భవనాల నిర్మాణంతో పోలీసుల బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు.
Also Read: బంగారం కేసును చేధించిన రామగుండం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు..
ఎన్టిపిసి, తెలంగాణ పవర్ ప్లాంట్, FCI, సింగరేణి, జైపూర్ ప్లాంట్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండటంతో ఉన్నత అధికారులు, వీవీఐపీలు వచ్చినప్పుడు సింగరేణి, ఎన్టిపిసి సంస్థల పై ఆధారపడవలసి వస్తుందన్నారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారులకు గెస్ట్ హౌస్ కావాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ,శ్రద్ధ తీసుకొని దాని నిర్మాణానికి ప్రత్యేకంగా చైర్మన్ కృషి చేసారు అని సిపి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: సెప్టెంబర్ కల్లా 300 మెగావాట్ల సింగరేణి సోలార్ సిద్ధం..
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ పోలీసుల పని తీరుతో రాష్టంలో క్రైమ్ రేటు తగ్గింది అని తెలంగాణ ప్రభుత్వ హయంలో పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు పోలీస్ శాఖకు అవసరమయిన మౌళిక సదుపాయల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను సమకూర్చడం జరుగుతోందని అన్నారు
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కేవలం పోలీస్ భవనాలే కాకుండా కార్పొరేటర్ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భవన కార్యాలయ నిర్వహణతో అనువుగా నూతన భవనంలో కావల్సిన ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు . మెదట రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి, ఉన్నత అధికారులు నూతన భవనాల పరిశీలించిన తరువాత రెండు నెలల్లో ప్రారంభోత్సవ మూహుర్తానికి తేది ఖరారు చేయడం జరుగుతుందని చైర్మన్ పోలీస్ కమిషనర్‌కు తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరం లో పోలీసులకు నివాస గృహాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కోలేటి దామోదర్ తెలిపారు.
Also Read: కేసీఆర్ పై సంజయ్ వాగ్బాణాలు
ఈ పరీశీలనలో మున్సిపల్ కమీషనర్ ఉదయ్ కుమార్, పెద్దపల్లి డీసీపీ రవీందర్, అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజీవ్, ట్రాఫిక్ ఎసిపి బాలరాజు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ రమేష్, రాజ్ కుమార్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ ,ఆర్ఐ మధుకర్ , ఎస్ఐ లు ప్రవీణ్,సతీష్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ డిఇ-విశ్వనాథం, ఏఈఈ సాయి చంద్, వినయ్, కాంట్రాక్టర్ మాలకొండయ్య పాల్గొన్నారు.