భగవద్గీత – 42
మనిషి బ్రతకడానికి అనంతమయిన మార్గాలున్నాయి. మనం ఎన్ని చదువులు చదివినా అవి పొట్టనింపుకోవటం కోసమే అని గ్రహించాలి. `కోటివిద్యలు కూటి కొరకే` అని సామెత.
అయితే ఇన్ని వృత్తులు, ఉద్యోగాలద్వారా మనిషి సంపాదించేది వ్యవహారం స్వచ్ఛంగా నడిపి సక్రమంగా సంపాదించినదేనా? ప్రతి మనిషి ఎవరికి వారు తమకు తాముగా వేసుకోవలసిన ప్రశ్న.
Little bit introspection is needed!
ఈ ప్రశ్నకు సమాధానం ’’అవును’’ అని వస్తే…
మీరు సమర్పించే పత్రమయినా, పుష్పమయినా, ఫలమయినా, ఆయన నెత్తిన నాలుగు చెంబులు నీళ్లు పోసినా చాలు. ఆయన ఆనందంతో ఊగి పోతాడు.
Also read: నేటి ఆలోచన రేపటి భవిష్యత్తు
‘‘కాదు ’’ అని వస్తే…
వేంకటేశ్వరస్వామి వారికి ఫలానా వ్యాపారి వజ్రవైఢూర్యాలతో పొదగబడి కోట్లు ఖరీదుచేసే కిరీటం బహూకరించాడు అని వార్త వస్తుంది.
ఆ తరువాత ఆయన ఫలానా కేసులో ఇరుక్కుని కటకటాల పాలయ్యాడు అని కూడా వార్త వస్తుంది.
స్వామివారికి ‘‘వితరణ’’ ’’బహుకరణ’’ ఇత్యాది పదాలు మన పాత్రికేయ మిత్రులు వాడుతుంటారు.
నిజంగా ఆలోచించండి.
అనంత కోటి బ్రహ్మాండనాయకుడికి దానం చేయటమో, బహుకరించటమో చేయగల సమర్ధులమా మనము? అక్కడ వాడవల్సిన పదము ‘‘సమర్పణ’’.
Also read: చేతిలో జపమాల, మనసులో మధుబాల!
(ఇంకా అర్దంకాని వారికి… ఇది అంబానీగారికి అయిదు పైసలిచ్చి నేను దానం చేశానహో అని చెప్పుకునే వాడిని మనము ఎలా చూస్తాం? అలాంటిదే!)
ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే మనం సమర్పించే ద్రవ్యము శుద్ధి అయినదా కాదా?
ద్రవ్యశుద్ధి ఉంటేనే పరమాత్మ స్వీకరిస్తాడు. స్వచ్ఛమైన వ్వవహారం ద్వారా సమకూరిన ధనం, దాని ద్వారా సమకూరిన అన్నము, సరిఅయిన క్రమశిక్షణ ద్వారా ఆచరణశుద్ధి, స్నానం వలన శరీర శుద్ది, ఇవి బాహ్యశుద్దిలో భాగాలు.
రాగద్వేషాలు లేకుండా కపటంలేకుండా Straight forwardness ఉండటం అంతః కరణశుద్ధి అనబడుతుంది. ఈ రెంటినీ కలిపి మాత్రమే ’’శౌచము’’ అనిపిలుస్తాము. అలాంటి శుద్దిఉన్న వ్యక్తి ఇస్తేనే ఆయన స్వీకరిస్తాడు.
ఆత్మశుద్ధిలేని ఆచారమది ఏల? భాండ శుద్ధిలేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివ పూజలేలయా ? అని కదా వేమన మొత్తుకున్నది!
Also read: నేటి రమణమహర్షి ఎవరు?
ఆ ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లినపుడు హుండీలో ఎంతవేయాలా? ఎంతవేశామా? అనే చింతమాని మనస్సనే హుండీలో ఆయన వైభవం ఎంత నింపుకున్నాము, ఆ దివ్యమంగళరూపం మన హృదయాన్ని ఎంత ఆక్రమించింది అని లెక్కలు వేసుకుందాం.
ఆయనను మనం కోరుకోవలసినది ఆయన పాదకమల సేవ. ఆయన పాదార్చకుల తోటి నెయ్యము. వారితో స్నేహము నితాంత అపార భూతదయ…
అమానిత్వమ్ అదంభిత్వమ్ అహింసా క్షాంతి ఆర్జవమ్
ఆచార్యోపాసనమ్ శౌచం స్థైర్యమ్ ఆత్మమనిగ్రహః
నేనే గొప్ప అనే భావం లేకుండటం, డాంబికం లేకుండటం, అహింస, భూతదయ, సరళస్వభావము, గురుజనుల సేవ…ఇవి ఉన్నవాడే ఆయనకు ఇష్టుడు!
ఇట్లాంటి వారిచ్చినవి ఆకు అయినా, పువ్వు అయినా, ఆఖరికి నెత్తిన నీళ్ళు పోసినా ఆయన ఆనంద తాండవం చేస్తాడు.
Also read: అణుబాంబు రూపంలో మృత్యువు