దేవుడున్నాడా
కనిపించడెందుకని
ఎక్కడ అని గట్టిగా అడిగితే
ఎదురొచ్చాడు నరసింహం
భయపడి దండం పెట్టాను.
నవ్వి ఏం కావాలన్నాడు
ఏమడగాలో తెలియలేదు.
నువ్వు అందరికీ తెలియాలి అన్నా.
పురుషార్ధాలు తెలుసుగా
దారి తెలిసి ప్రయాణించని వాడిని
నేనెందుకు పట్టించుకుంటానన్నాడు.
సరే, నాకు గురువు కావాలి అంటే
ఎవడికి వాడే గురువు
మననం చేస్తే
నువ్వు నేనైపోతావ్ అనేశాడు.
కళ్ళు మిరిమిట్లుగొలిపే కాంతి
కళ్ళు నులుముకుంటున్నా
మెలకువ వచ్చేసింది.
Also read: “ప్రయాణం”
Also read: “పండగ దేవుడు”
Also read: “అద్వైతం”
Also read: ‘‘ప్రపంచం”
Also read: “తపన”