Sunday, December 22, 2024

కనబడుట లేదు

—————-——

          రాజేందర్ జింబో

———————–

ఈ పండుగలు

ప్రత్యేక దర్శనాల

బాధల నుంచి

వీవీఐపిల నుంచి

విముక్తి కోసం

అతను మాయమైపోయాడు

కాదు…

పారిపోయాడు

అతని ఆచూకీ కోసం

హెబియస్ కార్పస్ ని దాఖలు చేసారొకరు

అతని ఆచూకీని పోలీసులు కనుక్కోలేక పొయ్యారు

చెప్పకుండా పారిపోయినందుకు

కేసు నమోదు చేసి

వారంటుని జారీ చేసారు మరొకరు

ఫలితం లేకపోయింది

చివరికి

ప్రకటిత నేరస్తుడి గా (ProclaimedOffender) ప్రకటించారు

ఇప్పుడెవరైనా అతన్ని పట్టుకోవచ్చు

అతను ఏ వీఐపి ఇంట్లోనో దాక్కుని వుంటాడు

లేదా

వైకుంఠానికో వెళ్ళిపోయివుంటాడు

ఈ పరిస్థితి ని అధిగమించడానికి

ఓ మిత్రుడన్నాడు

డిల్లీని తిరుపతికి మార్చాలని ,

మీరలా అంటే

మేము ఏడుకొండలు నే ఎత్తి

ఢిల్లీ లో పెట్టాలంటాము.!!

అన్నాడు ఓ డిల్లీ పెద్ద

ఏమైనా

జనం సంద్రం తగ్గి

కొండలన్నీ హాయిగా

ఊపిరి పీల్చుకున్నాయి

Also read: నొప్పి మందు

Also read: ఒకప్పుడు …

Also read: నో …ఓపెన్ సెసేం

Also read: బ్రహ్మకమలం

Also read: నాలుగు పాదాల మీద న్యాయం …

   

Rajender Mangari
Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles