భగవద్గీత–89
బంగారం అంటే ఎనలేని మోజు మనిషికి. వజ్రం ఓహో అపురూపం. వెండిసామాన్లు ఇంటినిండా. వీటిని సంపదలనుకొని పోగేసుకుంటున్నాము. మరి నిజమేమిటి? సరే! మనం చదువుకున్న సైన్సు ఏమి చెపుతున్నది?
సృష్టిలో ఏ పదార్ధాన్ని అయినా తీసుకుని విడగొట్టి రేణువుగా చేశాం. అది ఆ పదార్ధపు పరమాణువుగా కనపడుతుంది. అంటే బంగారపు పరమాణువు, వెండి పరమాణువు. ఇలా ఆయా పదార్ధాల పేర్లమీద ఆ పరమాణువు పిలవబడుతుంది. ఈ పరమాణువులను ఇంకా విడగొట్టాం. మనకు ఏం కనపడుతుంది? అన్నింటిలో ఒకటే, అంతటా ఒకటే. అవే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ లు, న్యూట్రాన్లు.
Also read: శ్రద్ధాభక్తులు లేని కార్యం నిష్ప్రయోజనం
ఎంతపెద్ద రాజసౌధమైనా, పూరిగుడిసె అయినా కట్టింది ఆ ఇటుకతోనే.
ఇక ఎలక్ట్రాన్ ఒక రేణువా? కాదు తరంగము. ఒక తరంగమా? కాదు రేణువు. ఇప్పుడే ఇక్కడ చూశాను. అది అక్కడున్నదేమిటి? అక్కడున్నది అప్పుడే అది ఇక్కడకు వచ్చినదేమిటి? ఏమిటి ఈ మాయ? కదలకుండా ఉన్నదన్న పదార్ధంలో ఇంత విపరీత వేగంతో ఈ చలనాలా?
‘‘ఆ ఎలక్ట్రాన్ దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా, రేణువా లేక తరంగమా మనకు తెలిసికొన శక్యముకాదని’’ హైసెన్బర్గ్ అనేశాస్త్రవేత్త ఎప్పుడో చెప్పారు. దాని పేరు Heisenberg uncertainty principle. ఇదీ సైన్సు మనం చదువుకున్నది.
Also read: పక్కవాడి పొడ భరించలేకపోతున్నారా?
సర్వతః శృతిమల్లోకే సర్వమ్ ఆవృత్య తిష్ఠతి… ఎంత బాగా చెప్పాడు ఆ కిట్టయ్య.
సర్వతః శృతిమత్ అట. అంటే ప్రతిదీ ఆయనకు తెలుస్తుంది. అంతే కాదు సర్వమ్ ఆవృత్య అట అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడట ఆయన.
అంతేనా!
సర్వేంద్రియ గుణాభాసం అచరం చరమేవ చ
సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయమ్ దూరస్థం చాంతికే చ తత్ !
చరాచర భూతములన్నింటికినీ బాహ్యభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచరరూపుడును అతడే అతిసూక్ష్మరూపుడైనందువలన తెలిసికొన శక్యము కానివాడు. అతిదూరంగా అతిదగ్గరగా స్థితుడైనవాడు అతడే.
Also read: మానసిక ప్రశాంతతే స్వర్గం