రక్షించు నా దేశాన్ని ఉగ్రవాదం నుండి
రక్షించు అరాచక మనస్తత్వం నుండి
రక్షించు స్వార్థపరుల పిడివాదం నుండి
అందరూ ఒకటిగా, మనుషులుగా బ్రతికే శక్తి నివ్వు
మమ్ము కాపాడు అచేతనత్వం నుండి
న్యాయం ధర్మం తెలిసే ఆలోచన నివ్వు
మంచి చెడుల విచక్షణ నివ్వు
నమ్మిన విషయం కోసం నిలబడే ధైర్యాన్నివ్వు
అలసత్వం నుండి నిస్సత్తువ నుండి నిద్ర లేచి
మానవతను జాతీయతను నిలబెట్టే పటిమ నివ్వు
స్వార్ధం వేయి తలలతో బుసకొట్టే వేళ
ఉదారత్వం, త్యాగంతో సానుకూలం కాని నాడు
శిక్షణతో సరిచేయ లేనిది ప్రేమతో దిద్ద లేనిది
శిక్షతో నియంత్రించే సంయమన మివ్వు
ఈశ్వరా నీ బాట నడిచే శక్తి నివ్వు.
Also read: లాస్ట్ అండ్ ఫౌండ్
Also read: సశేషం
Also read: మలుపు
Also read: జీవితం
Also read: నిన్న – నేడు