Sunday, December 22, 2024

చనిపోయినప్పుడు గీత వినిపించడం కాదు, బతకాలంటే వినాలి

భగవద్గీత84

పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య…

ఋణభారం ఎక్కువైతే ఆత్మహత్య…

భార్యాభర్తల మధ్య కీచులాటలు తట్టుకోలేక ఆత్మహత్య…

వ్యవసాయం లాభసాటిగాలేక సంసారాన్ని ఈదలేక ఆత్మహత్య…

ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక మూల జరుగుతున్నవే. అందుకు ఎవరో ఒకరు కారణమనే ఆరోపణలు మనం నిత్యం చూస్తున్నదే. అసలు దీనికి కారణమేమిటి?

జీవితం అంటే ఇట్లా ఉండాలనే పెద్ద ఊహ ఒకటి మనిషి అల్లుకుంటాడు. కానీ వాస్తవం దానికి పూర్తి విరుద్ధంగా కనపడుతుంది. అంటే తన అంచనాకి, వాస్తవానికి మధ్య ఒక పెద్ద అంతరం ఉన్నది. ఆ అగాధాన్ని, ఆ అంతరాన్ని దాటలేని నిస్సహాయత మనిషిని బలవన్మరణంవైపు నెట్టేస్తున్నది. అలా జీవితంలో జరగకుండా ఉండాలంటే ఆ వ్యత్యాసాన్ని పూడ్చాలి. కేవలం దానిని తాత్త్విక చింతనతో మాత్రమే పూడ్చాలి.

Also read: మన ధర్మమె మనకు రక్ష

బలహీనక్షణాలలో మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలో ఆ క్షణమే మార్పుతెచ్చుకోవాలి. We need paradigm shift. ఆ Shift ఎలా వస్తుంది? మనలను మనం ప్రశ్నించుకోవడం వలన. మరి ఎలా ప్రశ్నించుకోవాలి? పార్ధుడిని పరమాత్మ ప్రశ్నించినట్లుగా ప్రశ్నించుకోవాలి.

కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్‌

అనార్యజుష్టమస్వర్గ్యమ్‌ అకీర్తికరమర్జున ॥

“ఓ అర్జునా తగని సమయంలో ఈ మోహం నీకు ఎట్లా దాపురించినది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడేది కాదు, స్వర్గాన్ని ఇచ్చేది కాదు, కీర్తిని కట్టబెట్టేదీ కాదు….`

Also read: ప్రకృతిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం ఉత్తమం

‘‘ఒరేయ్‌ నీకీ పాడుబుద్ధి ఎక్కడినుండి వచ్చింది? జీవితం గెలిచేవాడు ఆచరించేదికాదు, ఇది తగదు’’ అని గట్టిగా తనను తాను సమాధాన పరచుకోవాలి. జీవితంలో కష్టపడి పోరాడి సాధించుకోవాలితప్ప ఆత్మహత్య చేసుకుంటే ఒరిగేదేమీ ఉండదు.

లే… లేచి పోరాడని వ్యక్తిలో ఆలోచన రగలాలి. అది రగలాలి లేదా రగల్చాలి అంటే ఆ వ్యక్తికి `గీత` ఏమి చెపుతుందో తెలియాలి.

జీవితం అంటే పూలపాన్పుకాదు. జీవితం అంటే ముళ్ళబాటా కాదు. జీవితం అంటే జీవించడమే.

JUST LIVE IT…

NOTHING MORE THAN THAT… అనే స్పృహ కలగాలి. కలగాలి అంటే `గీత` చదవాలి లేదా అది చదివి చెప్పగలిగినవాడి చెంతనైనా ఉండాలి.

మనలను మన ఆలోచనలు అగాధంలోకి తోసేస్తున్నప్పుడు, మనలను ఒడిసిపట్టుకొని ఒడ్డుకు చేర్చేది `భగవద్గీత.` కనీసం ఒక్క శ్లోకాన్ని అయినా నేర్చుకొని దానిని ధ్యానిస్తే చాలు.

భగవంతుడి స్తోత్రాలు వేయి నేర్చుకొనేకంటే ఒక్క `గీతా`శ్లోకం నేర్చుకొని మన ఆలోచనలకు దానినే పునాదిగా చేసుకుంటే బ్రతుకు జట్కాబండి గతుకులేకుండా సాగుతుంది. అందుకే మనిషి చనిపోయినప్పుడు `గీత` వినిపించేకంటే, మనిషి తన బ్రతుకు తాను హాయిగా బ్రతకటానికి ప్రతిరోజూ ఆలయాలలోనైనా `గీత` వినిపించాలి, `గీతా`బోధ జరగాలి.

Also read: ఉత్తములను ఇతరులు అనుసరిస్తారు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles