రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
హిందూ జీవన గీతం
సకల వేద సారం
ఉపనిషత్తుల తాత్పర్యం
బ్రహ్మ సూత్రాల సంగ్రహం
రామాయణ, మహాభారత, భాగవత
విలువల సంక్షిప్త రూపం
సగుణ, నిర్గుణ బ్రహ్మల వివరం
కర్మ, భక్తి, జ్ఞాన మార్గ దర్శనం
అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతాల భిన్నత్వం
“భజ గోవిందం మూఢ మతే”లో ఏకత్వం
సకల ప్రాణికోటికి జీవన మార్గం
గీతా తత్వ అమృత ఆచరణం.
మత విశ్వాసం సన్నగిల్లి
సాంప్రదాయాల, ఆచారాల విలువలు మరచి
దేవుడిని జీవితం నుండి తప్పించేస్తున్న జాతికి
జీవితానికి అర్థం తెలిపేది గీత
ఏ విలువలతో జీవించాలో
ఏం చేయాలో, ఏం చెయ్య కూడదో
ఏదీ మంచో, ఏదీ చెడో
నీ కర్తవ్యం ఏమిటో
తెలియ చెప్పేది గీత
సకల ప్రపంచానికి వెలుగు నిచ్చే దేవుడి పాట
జీవిత పరమార్థం తెలిపే భగవద్గీత.