- అదో మానసిక వ్యాధి
- దయ్యం పేరిట దడ పుట్టిస్తున్న పద్మజ
మదనపల్లి అమ్మాయిల హత్య ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన కూతుళ్ళను చంపిన పద్మజ ఆమె భర్తను ఇప్పుడు జైలులో నుండి మానసిక చికిత్సాలయానికి తీసుకు వెళ్లారు.ఇదంతా ఒక నిజ జీవిత కథ. నేనే శివుణ్ణి…నేనే సైతాన్ ను అనే కథలు కథలుగా పుట్టాయి.నిజానికి భారత దేశంలో దేవుణ్ణి నమ్మే వారు ఎంత మంది ఉంటారో దయ్యాన్ని నమ్మే వాళ్ళూ అంతే మంది ఉంటారు. ఈ మానసిక వ్యాధికి మందు లేదు. చింత బరికెలు, ముళ్ళ కంపలతో దయ్యం పట్టిన వారిని చితక బాదితే దెబ్బకు దయ్యం పోతుందనే పూర్వీకుల ఆచారాలు, నమ్మకాలు ఇప్పటికి ప్రచారం లో ఉన్నాయి. కాబట్టి రోజూ దయ్యాలతో దోస్తే చేసే బాబాలు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తూనే ఉంటారు.
Also Read : వంగర రూపు మారనుందా?
ఇష్టమైనవారిని ఆవహించే ఆత్మలు
నిజానికి దయ్యాలు చూసిన వారి కంటే, “భ్రమ” ను దయ్యంగా భావించే వారే ఎక్కువ. స్మశాన వాటికలో, పాడుబడ్డ ఇళ్లల్లో , పురాతన కోటల్లో కోరికలు తీరక, లేదా పిన్న వయసులోనే హత్య కు గురయిన వారు…ఆత్మలుగా చింత చెట్లు, లేదా ఆకాశంలో తిరుగుతూ, వాళ్లకు ఇష్టం అయిన వారి వెంట పడతారని ఒక నమ్మకం. ఈ దయ్యాలను పారద్రోలడానికి శివుని రూపంలో దుష్ట శక్తుల పన్నాగం పట్టే అతీత శక్తులను అవపొసనం పట్టడానికి చేసే క్షుద్ర పూజల వల్ల ఈడొచ్చిన రెండు ప్రాణాలు గాలిలో కలసి పోయాయి…కొరికెలు తీరని ఆ అమ్మాయిలు బ్రతికున్న ఈ తల్లి దండ్రులను దయ్యాలు అయి పట్టుకోవాలి. చదువుకున్న మూర్ఖ శిఖామణి పద్మజ అభం శుభం ఎరగని కన్న పిల్లల ఉసురు తీసింది! ఈ సైకో తల్లి రోజు శివుడు (ఉంటే) స్మశానం లోనే ఉంటాడని, కాలిన శవాల బూడిదను రాసుకుంటాడనే చిన్న లాజిక్ తెలిస్తే ఈ ఉన్మాద స్థితి నుండి బయటకు వచ్చేవారు! శవాలు గా మారే తమ పిల్లలు ప్రీతి పాత్రమైన శివుడు తిరిగి బిడ్డలను బ్రతికిస్తాడని అనుకోవడమే పెద్ద భ్రమ. ముక్కుపచ్చలారని యువతులను బలి ఇవ్వడం ముదిరిన పిచ్చికి తార్కాణం.
Also Read : పంచాయతీ వ్యవస్థలో మహిళా సాధికారిత పేరుకే! పురుషులదే పెత్తనం!
దయ్యాలు ఉన్నాయా?
అసలు దయ్యాలు ఉన్నాయా చూద్ధాం. విజ్ఞాన శాస్త్రజ్ఞులలో అత్యధికుల ఏకాభిప్రాయం ఏమిటంటే, దెయ్యాలు ఉన్నాయని రుజువు లేదు. వాటి ఉనికిని తప్పుడు ప్రచారం చేయడం తీరని నేరం. దెయ్యం అనే పదాన్ని సూడో సైన్ గా వర్గీకరించారు. శతాబ్దాల పరిశోధన చేస్తున్న వారికి చనిపోయినవారి ఆత్మలు ఏ ప్రదేశంలోనైనా నివసిస్తాయని శాస్త్రీయ ఆధారాలు దొరకడం లేదు. మానసిక దౌర్భాగ్యం హేతుబద్ద ఆలోచన లేని వారే దయ్యాలను నమ్ముతారు. అల్జీమర్స్ వ్యాధి తో పాటు అతిగా అతీంద్రీయ శక్తులు ఉన్నట్టు భ్రమ పడే వారినే లేని దయ్యాలు పట్టి పీడిస్తాయి.. క్షీణించిన మెదడు వ్యాధులు కూడా దయ్యం భ్రమ కు కారణం. సాధారణ ప్రిస్క్రిప్షన్ లో వాడే మందుల ప్రభావం, స్లీప్ ఎయిడ్స్ వంటివి కూడా అరుదైన సందర్భాల్లో, దెయ్యం లాంటి భ్రాంతులు కలిగించవచ్చు.ముఖ్యంగా జోల్పిడెమ్ డిఫెన్హైడ్రామైన్, కార్బన్ మోనాక్సైడ్ విష పూరిత మందులు దయ్యం లాంటి భ్రాంతులు కలగడానికి కారణం.
Also Read : వివాహ వ్యవస్ధ పయనం ఎటు?
పద్మజలు ఎందుకు పుట్టుకొస్తున్నారు?
జానపద సినిమాలు ఎక్కువ చూసే వారికి దయ్యాలు అనేవి నిజ జీవిత కల్పనలు అవుతాయి..వారు అతిగా ప్రచారం చేయడం వల్ల పద్మజలు పుడుతున్నారు! జానపద కథలలో, దయ్యం అంటే చనిపోయిన వ్యక్తి లేదా జంతువు ఆత్మ లేదా ప్రాణం తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతుంది… దెయ్యం కథలో, దెయ్యాల వర్ణనలు ఒక అదృశ్య ఉనికి నుండి అపారదర్శక లేదా కేవలం కనిపించే తెలివిగల ఆకారాలకు, వాస్తవిక, జీవిత రూపాలకు మారుతూ ఉంటాయి! మరణించిన వ్యక్తి యొక్క ఆత్మను బలహీన మనుష్కులు అంవహించుకోవడాన్ని నెక్రోమాన్సీ అని పిలుస్తారు?
Also Read : అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి
బూచాడంటే భయం
జానపద కథలలో, దయ్యం అంటే చనిపోయిన వ్యక్తి లేదా జంతువు యొక్క ఆత్మ లేదా ప్రాణం. దయ్యంగా మారుతుందని పెద్దలు కథలు అల్లారు…చిన్నప్పుడే అమ్మ మనకు అన్నం పెట్టేప్పుడు తినకుంటే బుచాడు అని భయపెట్టి తినిపించేది… అలా మనలో తెలియని దయ్యాలు భ్రమలుగా మెదడులో నిక్షిప్తం ఆయ్యాయి.. దెయ్యాల వర్ణనలు ఒక అదృశ్య ఉనికి నుండి అపారదర్శక లేదా కేవలం కనిపించే తెలివిగల ఆకారాలకు, వాస్తవిక, జీవిత రూపాలకు మారుతూ మనకు కనిపించేలా మన మెదడు పొరల్లో నాటుకు పోయాయి.
Also Read : సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
ఆత్మల వ్యక్తీకరణలు
మరణానంతర జీవితం ఉనికిపై నమ్మకం, అలాగే చనిపోయినవారి ఆత్మల వ్యక్తీకరణలు విస్తృతంగా మనలో వ్యాపించాయి. అక్షరాస్యత ఉన్న వారిలో లేని వారిలో కూడా నాటుకు పోయాయి. దీనికి కారణం అన్ని సంస్కృతులలో పూర్వీకుల ఆరాధన ఒక కారణం కావచ్చు..కొన్ని మతపరమైన పద్ధతులు-అంత్యక్రియల కర్మలు, భూతవైద్యాలు, మరియు ఆధ్యాత్మికత కర్మ సిద్ధాంతాలు మనకు నూరిపోసి దేవుడు ఎలాగో దయ్యం ఆలాగే అని ఉగ్గు పాలతో నింపేశారు! దానికి తోడు దేవునికి వ్యతిరేకంగా దయ్యాన్ని పెంచి పోషించడం వల్ల నరనరాల్లో భయం మనిషిని పట్టిపీడిస్తుంది! దానికి విరుగుడు కూడా మనం కార్యకరణ సిద్ధాంతాలను మెదడులో నిక్షిప్తం చేయలేక పోవడం వల్లే మూఢ నమ్మకాలు వెళ్లూనుకు పోయాయి..చదువుకున్న వారు కూడా సైకో లు మారడం మదనపల్లి సంఘటనలే నిలువెత్తు నిదర్శనం!!
Also Read : మదనపల్లి హత్యలు మానసిక వైకల్యానికి నిదర్శనం