హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెఛ్ఎంసీ)కి రేపు (1న) జరిగే పోలింగ్ కు సంబంధించి అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాల సమాచారం.
మొత్తం డివిజన్లు 150, బరిలోని అభ్యర్తుల సంఖ్య 1122.
వీరిలో టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149, కాంగ్రెస్ 146, టి.డి.పి 106, ఎం.ఐ.ఎం 51, సి.పి.ఐ 17, సి.పి.ఎం 12, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415.
మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260. పురుషులు 38,76,688, స్త్రీలు 35,65 896., ఇతరులు 676
మొత్తం పోలింగ్ కేంద్రాలు 9,101. మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 28683.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూం ల ఏర్పాటు. ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఏదో ఒకటి.
ప్రతి పోలింగ్ కేంద్రంలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు. కోవిడ్-19 పాజిటీవ్ లక్షణు కలిగి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం. వారికి ఉదయం 6:15గంటలలోగా పోలింగ్. పోలింగ్ కేంద్రాలలో జరిగే సాధారణ పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అసవరమైన చోట్ల 3వ తేదీన రీపోలింగ్. 4వ తేదీన ఓట్ల లెక్కింపు.