Tuesday, January 21, 2025

ఉత్కంఠ రేపుతున్న గ్రేటర్ మేయర్ ఎంపిక

యావత్ తెలంగాణ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ మేయర్ డిప్యుటీ మేయర్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. జీహెచ్​ఎంసీ టీఆర్ఎస్ మేయర్‌ అభ్యర్థిగా పార్టీ సెక్రటరీ జనరల్‌ కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది.  బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా గెలిచిన గద్వాల విజయలక్ష్మిని పార్టీ ఎంపిక చేసినట్టు సమాచారం. అటు డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా మోతె శ్రీలత పేరు కూడా  దాదాపు ఖరారైంది. తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించిన మోతె శ్రీలతను డిప్యుటీ మేయర్ గా పార్టీ ఎంపిక చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​తో టీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. వారికి కేటీఆర్​ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్‌ ఎన్నికపై అనుసరించాల్సిన అనుసరించాల్సిన వ్యూహాలను కేటీఆర్ సభ్యులకు వివరించారు. అక్కడ నుంచి తెరాస కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు

ఇదీ చదవండి: మేయర్ పీఠం…పావులు కదుపుతున్న టీఆర్ఎస్

బరిలో బీజేపీ:

బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆర్కే పురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్ రెడ్డిని, డిప్యుటీ మేయర్ గా రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పేరును ఆపార్టీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రకటించారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయల్దేరేముందు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు బషీర్ బాగ్ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles