- కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేరుతో గెజిట్ జారీ
- గెజిట్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ పార్థ సారథి
తెలంగాణలో గత సంవత్సరం డిసెంబరులో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ని 150 డివిజన్ల నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజిట్ లో పొందుపరిచారు. గెజిట్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థ సారథి జారీ చేశారు. 150 డివిజన్ల నుంచి ఎన్నికైన అభ్యర్థులతో పాటు, పార్టీ వివరాలు, రిజర్వేషన్లు లాంటి పలు అంశాలను గెజిట్ లో వెల్లడించారు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 11వ తేదీతో ముగియనుంది. మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నిక కోసం కొత్త పాలక మండలి తొలి సమావేశ తేదీని ప్రకటించేందుకు మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.
అయితే ఈ నెల 5న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. నోటిఫికేషన్ పై కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు.
ఇదీ చదవండి: ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ యత్నం