Sunday, December 22, 2024

జీహెచ్ఎంసీలో సకలం ఎగ్జిట్ పోల్ : టీఆర్ఎస్ ఆధిక్యం, బీజేపీ ముందంజ

అశ్వనీకుమార్ ఈటూరు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల చివరి ఘట్టం – ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కార్యక్రమం – శుక్రవారంనాడు జరగనున్నది. మంగళవారంనాడు వాయిదా పడిన పాతమలక్ పేట డివిజన్ లో పోలింగ్ గురువారంనాడు ప్రశాంతంగా జరిగింది. మంగళవారంనాడు పోలింగ్ జరుగుతుండగా సకలం చానల్ జరిపిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు దిగువన పొందుపర్చుతున్నాం. ఆ రోజు సాయంత్రం చివరి గంటలో జరిగిన అనూహ్య పరిణామాలు ఎవరికి అనుకూలమో, ఎవరికి ప్రతికూలమో ఎవరికి వారు ఊహించుకోవలసిందే. తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ బుధవారం ఉదయం పోలింగ్ శాతాన్ని 46కి పైగా చూపించారు. చివరికి అందిన వివరాలను కూడా కలిపి లెక్కవేస్తే ఆ శాతం వచ్చి ఉండవచ్చు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్ర 45 శాతం దరిదాపుల్లో పోలింగ్ జరిగిందని చెప్పిన అధికారులు రాత్రికి సవరించారు. మర్నాడు ఉదయానికి తాజా సవరణలు చేశారు.

దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా ప్రతికూలంగా రావడంతో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)హడావిడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం పెట్టి ఎన్నికల ప్రధానాధికారి చేత ప్రకటింపజేశారు. దుబ్బాక ఊపులోనే బీజేపీ రంగంలో దిగి వీరోచితమైన పోరాటం చేసింది. పోయిన జీహెచ్ ఎంసీ ఎన్నికలలో నాలుగు స్థానాలు మాత్రం గెలుచుకున్న బీజేపీ 150 వార్డులు గల జీహెచ్ఎంసీలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని కోరుకున్నప్పటికీ అది అంత సాధ్యం కాదు. కానీ తన సీట్లనూ, ఓట్లనూ గణనీయంగా పెంచుకునే ప్రయత్నం చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా తయారవుతుంది.

దుబ్బాకలో కానీ జీహెచ్ఎంసీలో కానీ పార్టీకి ఊపు తెచ్చిన నాయకుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడంలో సందేహం లేదు. వరదలు వచ్చి, ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా సఫలం కాలేకపోయిన టీఆర్ఎస్ ప్రజలకు ఏమి చెప్పాలో తోచక సందిగ్ధావస్థలో ఉన్న దశలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి ఇతివృత్తం బండి సంజయ్ ప్రసాదించారు. పాత హైదరాబాద్ లో పాకిస్తాన్ వారూ, రోహిగ్యాలూ ఉన్నారనీ, వారిని పారదోలేందుకు పాతబస్తీపైన తమ పార్టీ మేయర్ ఎన్నిక కాగానే సర్జికల్ దాడి చేయిస్తారనీ సంజయ్ మాట తూలారు. దమ్ముంటే చైనాపైన సర్జికల్ స్ట్రయిక్ చేయండి కానీ భారత దేశంలో భాగమైన హైదరాబాద్ పైన దాడి ఎందుకు  చేస్తారంటూ ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ –ఉల్ –ముస్లిమీన్ (ఏఐఏఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎదురు దాడి చేశారు. అసద్ సోదరుడు అక్బరుద్దీన్ మరో అడుగు ముందుకు వేసి హుస్సేన్ సాగర్ చుట్టపక్కల ప్రాంతాలలో స్థలం ఆక్రమించి నిర్మించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుల స్మారకాలనూ, సమాధులనూ అక్కడి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు దారుస్సలాంని ధ్వంసం చేయడానికి రెండు గంటల వ్యవధి కూడా అవసరం లేదంటూ సవాలు చేశారు. ఈ విధంగా ఒక వైపు బీజేపీ, మరో వైపు ఎంఐఎంలు చెలరేగి వాగ్యుద్ధం కొనసాగించడంతో వాతావరణంలో హింస చోటుచేసుకున్నది.  మూడు, నాలుగు దశాబ్దాల కిందట హైదరాబాద్ నగరంలో జరిగిన మతకలహాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రధాన ప్రచార సారథి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అదేపనిగా ప్రజలకు గుర్తు చేశారి వారికి ఆందోళన కలిగించి ఆలోచనలో పడవేశారు.

హైదరాబాద్ లో ప్రశాంతవాతావరణం కావాలంటే, మతకలహాలు జరగకుండా ఉండాలంటే టీఆర్ఎస్ కే ఓటు వేయాలంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో అప్పటికే నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలకు ఏమి చెప్పాలోనని ఆలోచిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రంగంలో దిగి ఖమ్మంలో, హైదరాబాద్ లో ప్రచారం చేశారు. దాంతో కేసీఆర్ కి ప్రచార ఇతివృత్తం దొరికింది. మీకు చంద్రబాబునాయుడు అమరావతి నుంచి రిమోట్ కంట్రోల్ తో చేసే పాలన కావాలో లేక హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా కేసీఆర్ చేసే పరిపాలన కావాలో కోరుకోండంటూ ప్రచారం సాగించారు. దాంతో ప్రజలందరూ టీఆర్ఎస్ కి ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీకీ, బీజేపీకీ ఓటు చేయాలని అనుకున్నవారు కూడా టీఆర్ఎస్ కే వేశారు. అప్పుడు చంద్రబాబునాయుడు చేసిన సహకారమే కేసీఆర్ కి ఇప్పుడు బండి సంజయ్ అందించారని రాజకీయ పరిశీలకులు చెప్పుకుంటున్నారు. బండి సంజయ్ అంత తీవ్రంగా మాట్లాడి ఉండకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేదనీ, బీజేపీ మెరుగైన స్థితిలో ఉండేదనీ పరిశీలకుల అభిప్రాయం. మొత్తంమీద అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ప్రజలు ఓటు చేశారు లేదా కొందరు ఓటు చేద్దామని అనుకున్నవారు కూడా ఇంటిదగ్గరే ఉన్నారు. ‘సకలం’ ప్రతినిధుల నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ కు మంచి మెజారిటీ లభిస్తుంది. ఎంఐఎం సహకారం అవసరం లేకుండానే మేయర్ పదవిని సొంతం చేసుకుంటుంది. బీజేపీకి రమారమి 30 స్థానాలు రావచ్చునని ఎగ్జిట్ పోల్ సమాచారం. ఏ డివిజన్ లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయో చూపించే పట్టిక దిగువన ఇస్తున్నాం. ఇదిగో పట్టిక:

Sl. NoCircle No. & NameWard No. & NameWinning party
11 – Kapra1 – KapraTRS
2 2 – A.S.Rao NagarCongress
3 3-CherlapallyBJP
4 4-Meerpet HB ColonyTRS
5 5-MallapurTRS
6 6-NacharamTRS
72 – Uppal7-Chiluka NagarTRS
8 8-HabsigudaTRS
9 9-RamanthapurBJP
10 10-UppalCongress
113-Hayathnagar11-NagoleBJP
12 12-MansoorabadTRS
13 13-HayathnagarBJP
14 14-B.N Reddy NagarTRS
154-L B Nagar15-VanasthalipuramBJP
16 16-HastinapuramBJP
17 17-ChampapetBJP
18 18-LingojigudaBJP
195-Saroor Nagar19-SaroornagarTRS
20 20-R.K PuramTRS
21 21-KothapetTRS
22 22-ChaitanyapuriTRS
23 23-GaddiannaramCong
246-Malakpet24-SaidabadTRS
25 25-MoosarambaghTRS
26 26-Old MalakpetTRS
27 27-AkberbaghBJP
28 28-AzampuraMIM
29 29-ChawaniMIM
30 30-DabeerpuraMIM
317-Santosh Nagar31-Rein BazarMIM
32 34-TalabchanchalamMIM
33 35-GowlipuraBJP
34 37-KurmagudaTRS
35 38-IS SadanMIM
36 39-Santosh NagarMIM
378-Chandrayangutta36-LalithabaghMIM
38 40-Riyasath NagarMIM
39 41-KanchanbaghMIM
40 42-BarkasMIM
41 43-ChandrayanguttaMIM
42 44-UppugudaBJP
43 45-JangammetMIM
449-Charminar32-PathergattiMIM
45 33-MoghalpuraMIM vsTRS
46 48-ShalibandaMIM
47 49-GhansiBazarBJP
48 52-PuranapulMIM
4910-Falaknuma46-FalaknumaMIM
50 47-NawabsahebkuntaMIM
51 53-DoodbowliMIM
52 54-JahanumaMIM
53 55-RamnasturapuraMIM
54 56-Kishan BaghMIM
5511-Rajendranagar57-Suleman NagarMIM
56 58-Shastri PuramMIM
57 59-MailaradevipallyBJP
58 60-Rajendra NagarMIM
59 61-AttapurTRS
6012-Mehdipatnam70-MehdipatnamMIM
61 71-GuddimalkapurTRS
62 72-Asifnagar Mim vs TRS
63 73-Vijay Nagar ColonyTRS
64 74-Ahmed NagarMIM
65 75-Red HillsMIM
66 76-MallepallyMIM
6713-Karwan Circle62-ZiagudaBJP
68 65-KarwanMIM
69 66-Lunger HouseMIM
70 67-GolcondaMIM
71 68-TolichowkiMIM
72 69-Nanal NagarMIM
7314-Goshamahal Circle50-Begum BazarBJP
74 51-Gosha MahalBJP
75 63-MangalhatBJP
76 64-Dattatreya NagarMIM
77 77-JambaghMIM
78 78-GunfoundaryMIM
7915-Musheerabad85-AdikmetTRS
80 86-MusheerabadBJP
81 87-Ram NagarTRS
82 88-BholakpurMIM
83 89-Gandhi NagarTRS
84 90-KavadigudaTRS
8516-Amberpet79-HimayatnagarTRS
86 80-KachigudaBJP
87 81-NallakuntaTRS
88 82-GolnakaBJP
89 83-AmberpetBJP
90 84-Bagh AmberpetBJP
9117-Khairatabad91-KhairatabadTRS
92 97-SomajigudaTRS
93 98-AmeerpetBJP
94 100-Sanath NagarTRS
9518-Jubilee Hills92-Venkateshwara ColonyTRS
96 93-Banjara HillsBJP
97 94-ShaikpetTRS
98 95-Jubilee HillsTRS Vs Con
9919-Yousufguda96-YousufgudaTRS
100 99-Vengal Rao NagarBJP
101 101-ErragaddaTRS
102 102-Rahmath NagarCong
103 103-BorabandaTRS
10420-Serlingampally104-KondapurTRS
105 105-GachibowliTRS
106 106-SeriliggampallyTRS Vs BJP
10721-Chanda Nagar107-MadhapurTRS
108 108-MiyapurTRS
109 109-HafeezpetTRS
110 110-Chanda NagarTRS
11122-Ramachandra Puram & Patancheruvu Sub111-Bharathi NagarBJP
112 112-RC PuramTRS
113 113-PatancheruvuBJP
11423-Moosapet114-KPHB ColonyTRS
115 115-Balaji NagarTRS Vs BJP
116 116-AllapurTRS
117 117-MoosapetTRS
118 118-Fateh NagarTRS
11924-Kukatpally119-Old BowenpallyTRS
120 120-BalanagarTRS
121 121-KukatpallyTRS
122 122-Vivekananda NagarTRS
123 123-Hyder NagarTRS
124 124-Allwyn ColonyTRS
12525-Quthubullapur127-Rangareddy NGRTRS
126 130-Subhash NGRTRS
127 131-QuthubullapurTRS
128 132-JeedimetlaTRS
12926-Gajularamaram125-GajularamaramCongress
130 126-JagadgiriguttaTRS
131 128-ChintalTRS
132 129-SuraramTRS
13327-Alwal133-MachabolaramTRS
134 134-AlwalBJP
135 135-VenkatapuramCongress
13628-Malkajgiri136-NeredmetTRS
137 137-Vinayaka NGRTRS
138 138-Moula-AliTRS
139 139-East-AnandbaghBJP
140 140-MalkajgiriBJP Vs TRS
141 141-Gowtham NGRTRS Vs BJP
14229-Secunderabad142-AddaguttaTRS
143 143-TaranakaTRS
144 144-MettigudaTRS
145 145-SeethaphalmandiTRS
146 146-Boudha NGRTRS
14730-Begumpet147-BansilapetTRS
148 148-RamgopalpetTRS
149 149-BegumpetTRS
150 150-MondamarketTRS

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles