- జాంబాగ్ డివిజన్ కౌంటింగ్ కు బీజేపీ అభ్యంతరం
- బాలెట్ బాక్సులకు సక్రమంగా సీల్ వేయని సిబ్బంది
ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ లు ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. జాంబాగ్ డివిజన్ ఎనిమిదో నెంబర్ బూత్ లో 471 ఓట్లు పోలయ్యాయని ఈసీ తెలిపింది. కాని బాలెట్ బాక్స్ లలో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయ. మిగతా ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ శాతాన్ని పొరపాటున తప్పుగా వెల్లడించామని తెలిపారు.
పోలింగ్ శాతం తప్పుగా చెప్పిన సిబ్బంది:
వివేకానంద నగర్ డివిజన్ లో 63నంబర్ బూత్ లో పోలింగ్ జరిగిన రోజు 355 ఓట్లు పోలైనట్లు సిబ్బంది తెలిపారు. కాని కౌంటింగ్ కు చేసేందుకు బాలెట్ బాక్సులు తెరవగా అందులో 574 ఓట్లు ఉన్నట్లు తేలడంతో ఎన్నికల అధికారులు ముందు చెప్పిన ఓట్ల కంటే 219 ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బూత్ నంబరు 76 లో బాలెట్ బాక్సులకు సీల్ సక్రమంగా వేయకపోవడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి ఎన్నికల అధికారులు బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈసీ తప్పిదాలపై న్యాయ పోరాటం చేస్తామని బీజేపీ స్పష్టం చేసింది.
also read :హైకోర్టు నిర్ణయం సవాలు చేస్తూ ఈసీ లంచ్ మోషన్ దాఖలు