హైదరాబాద్ :`కాగల కార్యం గంధర్వులే తీర్చారు`అని మహాభారతంలో వ్యాఖ్య. గ్రేటర్ హైదరా బాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కొందరు రాష్ట్ర మంత్రులలో అలాంటిదే గుబులు రేపుతోందట. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని అనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ ఎన్నికలను అందుకు సాధనంగా తీసుకున్నారని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొందరు మంత్రులను కొన్నేసి డివిజన్లకు బాధ్యులను చేస్తూ అక్కడ పార్టీ అభ్యర్థుల గెలుపో టములను వారి భుజాలపై పెట్టారు. ఇది మంత్రులకు అగ్నిపరీక్షలా మారింది. వాస్తవానికి అభ్యర్థుల కంటే వారికే ఫలితాల పట్ల ఉత్కంఠ ఉందనీ, ఈ ఫలితాలు అమాత్య పదవులపై ప్రభావం చూపుతుందనీ అంటున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితతో పాటు మరికొందరికి కొత్తవారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటే ఉన్నవారికి ఉద్వాసన చెప్పక తప్పదంటున్నారు. కేవలం కొత్త వారికి అవకాశం ఇవ్వడానికే కాకుండా పనితీరు బాగాలేదని భావిస్తున్న వారిని పక్కన పెట్టేందుకు కూడా జీహెచ్ఎంసీ ఫలితాలు ఆయుధంగా మారనున్నాయని రాజకీయ పరిశీల కులు వ్యాఖ్యానిస్తున్నారు.
also read:హైకోర్టు నిర్ణయం సవాలు చేస్తూ ఈసీ లంచ్ మోషన్ దాఖలు
also read:జీహెచ్ఎంసీ పోల్ : ఇంకు గుర్తు చెల్లదు : హైకోర్టు ఆదేశం