గ్రేటర్ ఎన్నికల్లో కమలం వికసించింది. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నగరంలో గుబాళించింది. మొదటి నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ కడ దాకా అదే దూకుడు కనబరిచింది. దీంతో నగరంలో బీజేపీ శ్రేణులు సంబురాలలో మునిగిపోయాయి. నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి పార్టీ శ్రేణులు, నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మిఠాయిలు పంచుకుని బాణసంచా కాల్చి సంబురాలలో మునిగిపోయారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఇపుడు అనూహ్యంగా పుంజుకుంది. కారు స్పీడుకి ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూ నువ్వా నేనా అన్న రీతిలో బీజేపీ పోటీనిచ్చింది. ఇదే ఉత్సాహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూపిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.