అమరాగాయకుడు అపర గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను చెన్నైకి చెందిన కళాప్రదర్శిని, వారి కుటుంబం సంయుక్తంగా రవీంద్రభారతిలో జనవరి 14 న నిర్వహిస్తున్నారు.
సాయంత్రం 5 గంటలకు ప్రముఖ గాయకులు గాయనిమణులు పాల్గొనే సంగీత విభావరితో వేడుకలు మొదలవుతాయి. ఆరు గంటలకు వివిధ నాట్య కళారూపాలతో ఘంటసాల ఆలపించిన పాటలు కృత్తులు, భగవద్గీత నృత్య ప్రదర్శన. సంగీత విభావరి కంచి స్వామి శ్రీ విజయేంద్ర సరస్వతి వారి అభిభాషణంతో ప్రారంభం అవుతుంది.
తరువాత కళా ప్రదర్శిని ఘంటసాల పురస్కారాన్ని సంగీత దర్శకులు సాలూరి వాసురావుకు, భగవద్గీత ఫౌండేషన్ అధినేత గాయకులు గంగాధర శాస్త్రికి ముఖ్య అతిథి భారత మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సమక్షంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు, ఘంటసాల తరం నేపథ్య గాయకులు పాలగుమ్మి రాజగోపాలరావు గౌరవ అతిధులుగా సుప్రసిద్ధ పాత్రికేయులు మా శర్మ,
సీనియర్ పాత్రికేయులు శుభోదయం మీడియా సీఈఓ
ఎస్ వి సూర్యప్రకాశరావు పాల్గొంటారని కళా ప్రదర్శిని చైర్ పర్సన్ పార్వతి రవి ఘంటసాల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కె కె రాజా నిర్వహణలో జరిగే
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతలుగా శ్రీవాణి మనోహర్, శిరీష బుర్రా వ్యవహారిస్తారు. ఈ శతబ్ది వేడుకలలో ఘంటసాల స్ఫూర్తి తో సంగీత సేవచేస్తున్న తాళ్ళురి నాగరాజు స్వరవీణా పాణి, రామాచారి, శాంతిశ్రీ, చల్లా సుబ్బారాయుడు, మహమ్మద్ రఫీ, లను ప్రత్యేకంగా సన్మానిస్తారు. రామాచారి శిస్యులు ఘంటసాల పాటలతో జరిపే సంగీత నీరాజానం తో కార్యక్రమం ముగుస్తుంది.