- ఇంతవరకూ ఆర్మీ చీఫ్ గా పని చేసి నరవణే
- హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో నియామకం
దిల్లీ: జనరల్ మనోజ్ ముకుంద్ నరవణేని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సర్వసైన్యాధ్యక్షుడు – సీడీఎస్)గా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించారు. జనరల్ నరవణే రెండో సీడీఎస్ గా వ్యవహరిస్తారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో దివంగతులైన జనరల్ బిపిన్ రావట్ స్థానంలో జనరల్ నరవణేను నియమించారు. జనరల్ నరవణే 31 డిసెంబర్ 2019న జనరల్ బిపిన్ రావత్ నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీవోఏఎస్)గా బాధ్యతలు స్వీకకరించారు. అంతకు ముందు వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ గా పని చేశారు. అంతకంటే ముందు ఈస్టర్న్ కమాండ్ కి జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ గా కూడా పని చేశారు.
మనోజ్ ముకుంద్ నరవణే 22 ఏప్రిల్ 1960న మహారాష్ట్రలోని పుణె లో పుట్టారు. అక్కడే పెరిగారు. చదువుకున్నారు. ఆయన తండ్రి ముకుంద్ నవరణే భారత వైమానిక దళంలో అధికారిగా పని చేసి వింగ్ కమాండర్ గా ఉద్యోగ విరమణ చేశారు. తల్లి సుధ ఆకాశవాణిలో అనౌన్సర్ గా పని చేసేవారు. జనరల్ రనవణే పుణె లోని జనప్రబోధిని పాఠశాలలో చదువుకున్నారు. పుణె లోని డిఫెన్స్ అకాడెమీలో విద్యను అభ్యసించారు. ఆతర్వాత డెహ్రాడూన్ లోని మిలిటరీ అకాడెమీలోచదివారు. అనంతరం చెన్నై లోని మద్రాసు విశ్వవిద్యాలయంలో రక్షణ వ్యూహాలు అనే విషయంలో ఎంఏ చేశారు. అదే విషయంలో ఇండోర్ లోని దేవి అహల్య విశ్వవిద్యాలయలో ఎంఫిల్ చేశారు. పంజాబీ యూనివర్శిటీ (పటియాలా)లో పీహెచ్ డి) చేశారు.
జనరల్ నరవణే భార్య వీణ పాతికేళ్ళుగా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆర్మీ వైవ్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ కు ఆమె అధ్యక్షురాలు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఆయనకు 2019లో పరమ విశిష్ఠ సేవా మెడల్, 2017లో అతి విశిష్ఠ సేవా మెడల్, 2015ల విశిష్ఠ సేవామెడల్ ప్రదానం చేశారు. నరవణే కి తోట పని అన్నా, యోగా అన్నా, పెయింటింగ్ అన్నా ఇష్టం.