బ్రౌన్ గ్రంధాలయం నూతన భవనాల నిర్మాణానికీ, స్థల సేకరణకూ ముఖ్యమంత్రి 2021 జులైలో మంజూరు చేసిన నిధులు ఇంతవరకూ విడుదల చేయలేదని బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి సభ్యుడు జానమద్ది విజయ్ భాస్కర్ గురువారంనాడు ఒక ప్రకటనలో ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ప్రకటన ఇట్లా ఉంది:
కడపలోని ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గ్రంధాలయ నూతన భవనాల నిర్మాణాలకు, స్థల సేకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 07-7-21న రూ. 5.50 కోట్లు మంజూరు చేశారు. నిధుల విడుదల జాప్యం కావడంతో వాటి ఖర్చు రూ.6.87 కోట్లకు పెరిగింది. 07-7-23న పెరిగిన మొత్తాలకు జీ.ఓ., బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చారు. CFMS ద్వారా బిల్లులు పాస్ అయ్యాయి. కానీ, ఇప్పటికి 28 నెలలు అయినా నిధులు విడుదల కాలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమై చివరకు విసిగి మీ ద్వారా పై బహిరంగ లేఖ పంపుచున్నాను. 10వ తేదీన బ్రౌన్ 225 వ జయంతి. ముఖ్యమంత్రి రేపు కూడా జిల్లాలో ఉంటారు.
జానమద్ది విజయ భాస్కర్,
బ్రౌన్ గ్రంధాలయ సలహా మండలి సభ్యులు, కడప.
సెల్ :94406 73556