————————-
(‘THE FULL MOON ‘ FROM ‘THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
25. సంచారి తత్త్వాలు
—————————
పూర్ణ చంద్రుడు నగరంపై గొప్పగా ఉదయించాడు. నగరంలో కుక్కలన్నీ చంద్రునిపై మొరగ సాగాయి.
ఒకే ఒక కుక్క మొరగలేదు. ఆ కుక్క లోగొంతులో మిగతా కుక్కలతో ఇలా అంది. ” మీరు చందమామ ను నిద్ర నుండి లేపి, ప్రశాంతతను పోగొట్టకండి. మీ మొరుగుడుతో చంద్రుణ్ణి భూమిపైకి తేకండి !”
అప్పుడు అన్ని కుక్కలూ మొరగటం ఆపి భయంకరమైన నిశ్శబ్దం పాటించాయి. కానీ ఆ కుక్కలకు బుధ్ది చెప్పిన కుక్క మాత్రం మిగిలిన రాత్రంతా — నిశ్శబ్దం కోసం అరుస్తూనే ఉంది.
Also read: ఎర్ర మట్టి
Also read: వంతెన నిర్మాతలు
Also read: తత్త్వ వేత్త మరియు చెప్పులు కుట్టేవాడు
Also read: కప్పలు
Also read: చట్టాలు మరియు చట్ట నిర్మాణం