భగవద్గీత –3
అంతా మన మంచికే అనే నానుడి ఉంది…
అంటే ఒక పని చేసేటప్పుడు కాయయినా, పండయినా ఏదయినా సరే మనకోసమే అనే భావన మనలో కలిగినప్పుడు మనకు ఏ విధమయిన బాధ కలగదు.
ఒకడు ఒక కోర్టులో కేసేశాడనుకుందాం. అందుకోసం చాలా డబ్బు, సమయం వెచ్చించాడు. వాడి దురదృష్టం కొద్దీ కేసు ఓడిపోయాడు. అయ్యో కేసూ పోయింది, డబ్బుపోయింది, అమూల్యమైన సమయం పోయిందని కూర్చుంటే వాడికి బాధే మిగులుతుంది. అలాకాకుండా కేసుపోతే పోయింది చట్టం, కోర్టులు, ప్రపంచమంటే ఏమిటో తెలిసింది అననుకుంటే అదొక ప్రశాంతత! అంటే జయాపజయాలను, లాభనష్టాలను సమానంగా భావించే స్థితి!
Also read: మనసు చేసే మాయాజాలం
ఇది అంత తేలికగా అలవడే స్థితి కాదు. ప్రతి పరిస్థితిని సమత్వబుద్ధితో చూడగలగటం అన్నమాట. ఇదొక అద్భుతమైన మానసిక స్థితి. దీనిని జ్ఞానయోగ దృష్టి అంటారు. WIN-WIN Situation in every moment of life…. అన్నమాట.
ఇంకొక దృష్టి గురించి భగవానుడు చెపుతున్నారు. అది నిష్కామ కర్మ యోగం. అంటే ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా (without expectations) ఇది నా కర్తవ్యం అనే భావనతో చేయడం! దీని వల్ల ఏ విధమయిన విపరీత ఫలితాలుండవు! …….JUST DO IT….. అని వింటున్నాం మనం, అంతే! పని చేయటం మన విధి, ఒకవేళ ఏదయినా ఆశించి (expectation) ఒక పని చేశామనుకోండి ఆ పని సఫలం కాకపోతే నిరాశ, నిస్పృహలు (frustration)మనలను ఆవరిస్తాయి! ఆశించే స్థాయి ఎంత ఎక్కవ ఉంటే నిస్పృహ స్థాయి అంత ఎక్కవగా ఉంటుంది.
Expectation leads to frustration దీనికి ఒక mathematical equation వేస్తే ఇలా ఉంటుంది. Frustration is directly proportional to Expectation force.
ఇక్కడ Zero Expectation సున్న అయితే Zero Frustration అంటే నిస్పృహ కూడ సున్న అవుతుంది.
Also read: భగవద్గీత