Thursday, November 21, 2024

స్నేహం

——–

FRIENDSHIP BY KHALIL GIBRAN

అనుసృజన : సి.బి. చంద్రమోహన్

——–

నీ అవసరాలకు సమాధానం నీ స్నేహితుడు

ప్రేమాంకురాలు నాటి

ఫలాన్ని పొంది

కృతజ్ఞతలు చెప్పే

బీజక్షేత్రమే స్నేహితుడు.

క్షుద్బాధలో కడుపు నింపేది

వేదనలో ప్రశాంతత నిచ్చేది

అతడి నులివెచ్చని సాన్నిహిత్యమే!

ఎవరు మనసు విప్పి మాట్లాడితే

మదిలోనైనా కాదనడానికి

వెనుకాడవో,

ఔననడానికి సందేహించవో,

అతడే నీ ప్రియస్నేహితుడు

అతడు శబ్దరహితుడైతే

ఆ గుండె శబ్దం వినడానికి

నీ గుండె ఆగపోదు!

ఎందుకేంటే, స్నేహంలో

ప్రశంసించలేని

ఆనందంతో-

నిశ్శబ్దంగా

నీ ఆలోచనలు

ఆకాంక్షలు

అంచనాలు

రూపుదిద్దుకుంటాయి

పెంచుకోబడతాయి.

మైదానం నుండి

పర్వతారోహకుడికి

కొండ స్పష్టమైనట్లు,

నీ స్నేహితుడి

పరోక్షంలో

నువ్వు అమితంగా

ప్రేమించే అతని గుణాలు

సుస్పష్టమవుతాయి

అందుకే

హితుని ఎడబాటుతో

నువ్వు దుఃఖించవు!

ఆత్మవలోకనం

తప్ప వేరే ఏముంటుంది

స్నేహంలో!!

నీకు అత్యంత ప్రియమైనది

నీ స్నేహితునిదే అనుకో

నీ నిర్వేదపు అలల పతనాన్ని చూసినట్లే

నీ ఆనంద నర్తన సాగరాన్ని కూడా

అతన్ని తెలుసుకోనివ్వు!

స్నేహం కాలాన్ని తీరిగ్గా మింగడానికే కాదు

బ్రతికిన క్షణాలు ఏరుకోవడానికి!!

హితుడు నీ అవసరాలు తీర్చడానికే

కానీ

నీ శూన్యతను నింపడానికి కాదు!

స్నేహమాధుర్యంలో

నవ్వుల పువ్వులు ఏరుకో

ఆనందాలు పంచుకో!

ఎందుకంటే

చిరు తుషార బిందువుల్లోనే

హృదయం ఉదయాన్ని కంటుంది

నవ్యతను సంతరించుకుంటుంది!!

—————

Original poem

Kahlil Gibran on Friendship

Your friend is your needs answered.
He is your field which you sow with love and reap with thanksgiving.
And he is your board and your fireside.
For you come to him with your hunger, and you seek him for peace.

When your friend speaks his mind you fear not the “nay” in your own mind, nor do you withhold the “ay.”
And when he is silent your heart ceases not to listen to his heart;
For without words, in friendship, all thoughts, all desires, all expectations are born and shared, with joy that is unacclaimed.
When you part from your friend, you grieve not;
For that which you love most in him may be clearer in his absence, as the mountain to the climber is clearer from the plain.
And let there be no purpose in friendship save the deepening of the spirit.
For love that seeks aught but the disclosure of its own mystery is not love but a net cast forth: and only the unprofitable is caught.

And let your best be for your friend.
If he must know the ebb of your tide, let him know its flood also.
For what is your friend that you should seek him with hours to kill?
Seek him always with hours to live.
For it is his to fill your need, but not your emptiness.
And in the sweetness of friendship let there be laughter, and sharing of pleasures.
For in the dew of little things the heart finds its morning and is refreshed.

Also read: భయం

Also read: అంకురాలు

Also read: మెల్లగా … మృత్యు ముఖంలోకి

Also read: ఓ…..మనిషీ!!

Also read: బంధన ఛేదిత – ఊర్వశి

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles