అందరికీ కావాలి స్వేచ్ఛ
అది ఆనందదాయకం
అభివృద్దికి మూలం
అఙ్ఞానాన్ని ఛేదించే కరవాలం.
అందని మాను పండైంది స్వేచ్ఛ
విద్యాశాలల్లో రాజకీయ కట్టడి
స్వయంవరాలు పోయి
వరకట్నాలకు బందీగా వివాహం
రిజర్వేషన్ల చెరలో ఉద్యోగాలు
మతమౌఢ్యంతో సమాజంలో విద్వేషాలు.
బలవంతుడి చేతిలో
ధనవంతుడి చేతిలో
రాజకీయుడి చేతిలో
అందరినీ పీడించే స్వేచ్ఛ.
చదువుల్లో ఆలోచించే స్వేచ్ఛ
అహం నుండి స్వేచ్ఛ
మంచి చేసే స్వేచ్ఛ
బాధ్యత లేని వారిని దారికి తెచ్చే స్వేచ్ఛ
అవసరానికి మించి సంపాదించని స్వేచ్చ
అత్యాశ, భోగాల నుండి మనసుకు స్వేచ్ఛ
ఆస్తులను కాక సమర్ధులైన సంతానాన్ని పెంచే స్వేచ్ఛ
అశాంతి నుండి అవినీతి నుండి స్వేచ్ఛ
స్వచ్ఛ గాలి, నీరు, ప్రకృతిని అనుభవించే స్వేచ్ఛ
ధ్వని కాలుష్యం లేకుండా ధ్యానించే స్వేచ్ఛ
సత్సంకల్పంతో సన్మార్గాన నడిచే స్వేచ్ఛ
ఏనాటికైనా లభించేనా!
Also read: మానవ జీవితంలో మార్గదర్శి భగవద్గీత
Also read: మానవ హక్కులు
Also read: ప్రమిద
Also read: బంధం
Also read: బంధం
Also read: అంతంలో అనంతం