Tuesday, January 21, 2025

ఇదే బలహీనమైన మన పత్రికాస్వేచ్ఛ!

రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రతా సూచీలు అయిదు అంశాలను ప్రపంచ పత్రికా దినోత్సవం నాడు 2023 మే 3 ప్రెస్ ప్రకటన చేశారు.

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో180 దేశాల జాబితాలో భారతదేశం అతి బలహీనమైన స్కోరుతో 161వ స్థానంలో ఉంది. మరీ 11 స్థానాలు దిగజారి 161వ ర్యాంక్‌ పడిపోయింది. ‘నియంతృత్వ పాలకుల అణచివేత విధానాలే కారణ హేతువులు’ అని ఒక ప్రధానమైన కారణమని జర్నలిస్టులు విమర్శించారు. కేవలం 180 దేశాల్లో కేవలం 52 దేశాల్లోనే పత్రికాస్వేచ్ఛ సజావుగా అమలు అవుతున్నదని వివరించారు.

మీడియాలకు రాజకీయ రంగు

తీవ్ర ఆందోళనకరంగా ఉన్న 31 దేశాల జాబితాలోనూ భారతదేశం ఉందనడం మామూలే.  42 దేశాల్లో జర్నలిస్టులు కష్టతరమైన పరిస్థితులను కనిపిస్తున్నాయి. మొత్తం 55 దేశాల్లో నిత్యం వీరు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.  రాజకీయ రంగు పులుముకొని రాజకీయనేతలతో సంబంధాలు ఉన్న వాణిజ్యవేత్తల నియంత్రణలోకి మీడియా సంస్థలు దిగిపోయింది. 

ప్రభుత్వాల అనుకూల శక్తులు జర్నలిస్టులని ఒత్తిళ్లకు గురిచేయడమే కాకుండా వారిపై కఠిన ఆంక్షలు విధించడం ఇదే పనిగా మారింది. ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ గా పనిచేసేవారికైతే ఎన్నో కష్టాలు. పోలీస్ వేధింపులకు గురిచేస్తూ సివిల్, క్రిమినల్ కేసుల్లో అన్యాయంగా వారిని ఇరికిస్తూ ఉన్నారు.

న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను ఢిల్లీ పోలీసు అరెస్ట్ చేసారు. (October 4, 2023న)

న్యూస్ పోర్టల్‌కు విదేశీ(చైనా) నిధులపైదర్యాప్తు చేసిన తరువాత ప్రబీర్ ను మరొకరిని ‘పట్టుకున్నారు’. చైనా అనుకూల ప్రచారానికి నిధులు తీసుకున్నారని తీవ్రమైన ఆరోపణ అని యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు(A Newsreport) పత్రికలు వివరిస్తున్నాయి. అయితే సమస్య అరెస్టు కాదు. యూఏపీఏ చట్టం, అందులో నిందితులైన వారికి బ్రతుకు భయంకరమై ఉంటుంది.

అప్పుడు మిసా ఇప్పుడు యూపా,

కీపింగ్‌ అఫ్‌‌ ది గుడ్‌ ఫైట్‌: ఎమర్జెన్సీ నుండి నేటి వరకుప్రబీర్‌జ్ఞాపకాలు ప్రచురించిన పుస్తకంపై రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులు, కార్యకర్తల సంఘీభావంతోనే ఉన్నారు. కాని కేసులు తీవ్రంగా ఉంటాయి. 1975 లో ఎమర్జెన్సీ అణచివేత, ప్రాథమిక హక్కుల హననం ఆ సమయంలో పుర్కాయస్థను జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) క్యాంపస్‌ నుండి ఎత్తుకెళ్లి చెరసాలలో పెట్టారు. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మిసా) కింద కేసు బనాయించారు. 50 ఏళ్ల తర్వాత అంటే 2023 డిసెంబరు 15న అదే క్యాంపస్‌లో నిరసనలను నిషేధిస్తూ, అప్పుడు ప్రబీర్‌, అమిత్‌లపై ఇప్పుడూ ఉపా చట్టం కింద కేసులు.

‘‘స్వేచ్ఛను నియంతల పాదాలకు సమర్పిస్తారా’’ అని సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది సంజయ్ హెగ్డే ప్రశ్నించారు. ‘మా స్వేచ్ఛను ఒక గొప్ప వ్యక్తి పాదాల వద్ద ఉంచకూడదని, మేము నిర్ణయించుకున్నాము’ అన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ అంటూ, మళ్లీ అటువంటి పరిస్థితి ఎన్నడూ రానివ్వకూడదు. మనకు లిఖిత రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని నిర్వహించే సంస్థలు ఉన్నాయి, కానీ ఇవి విఫలమైనప్పుడు , మనస్సాక్షి ఉన్న వాళ్లంతా పోరాటం సాగిస్తున్నారు, రాజ్యాంగం పౌరునికి, పౌరునికి మధ్య ఒక గంభీరమైన బంధాన్ని ఏర్పరిచింది. అదే ఈ దేశ ప్రజలంతా ఐకమత్యంగా కలిసి పని చేయడం, కలిసి జీవించడం’’ అని హెగ్డే వివరించారు.

చట్టం దృష్టిలో ఇది నేరమా?

హిందూ పబ్లిషింగ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌, జర్నలిస్ట్‌ ఎన్‌. రామ్‌ ‘‘ప్రస్తుత కాలం హిందుత్వ నిరంకుశ పాలన” అని విమర్శించారు. సుప్రీంకోర్టు ముందుకు వస్తే బతికే అవకాశాలు ఉన్నాయని ఈ వార్త (న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, 2023) చెబుతుంది. కాని ఈ ఆరోపణ కూడా తీవ్రమైందే. కప్పన్‌ ప్రయాణిస్తున్న వాహనంలో అల్లర్లను ప్రేరేపించే సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని పోలీసుల వాదనను ప్రశ్నిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, “ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా భావ వ్యక్తీకరణ హక్కు ఉంది. అతను (హత్రాస్) బాధితురాలికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు ఉమ్మడి గొంతును లేవనెత్తాడు. చట్టం దృష్టిలో ఇది నేరం అవుతుందా?” అని నిలదీసారు. ఇంతకు ముందు 2022 సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది .

తీవ్రమైన అంటే కొందరు బాధితులకు ఈడీ కేసు అంటే ED ప్రాసిక్యూషన్ కష్టంగా ఉంటాయి. ఈ చట్టం కింద ఫిర్యాదు మాత్రమే అయినా ఛార్జిషీట్‌తో సమానమై ఉంటుంది. నేరం రుజువుకాకముందే జైలుకు పంపిస్తారు. వారాలు నెలలు గడిచినా గతిలేదు. “ఐపిసి సెక్షన్ 120-బి పాక్షికంగా నేరపూరిత కుట్ర నేరానికి సంబంధించిన నేరపూరిత కార్యకలాపాలు మరికొన్ని కూడా భయంకరమైవి. ఉదాహరణకు కప్పన్ గురించి: “యూఏపీఏ కేసులో ష్యూరిటీల వెరిఫికేషన్‌కు 90 రోజులు పట్టింది. జనవరి 6న ED కేసులో, పూచీకత్తులను సమర్పించారు. ధృవీకరణ జనవరి 12 నుండి ప్రారంభమైంది. ష్యూరిటీల ధృవీకరణ కారణంగా అతని విడుదలలో జాప్యం జరిగింది” అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

UAPA యొక్క తీవ్రవాద సంస్థలో సభ్యత్వం ఉండడమే నేరం అవుతుంది. నవ్లాఖా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) మెంబర్ గా ఉండడం సెక్షన్ 13 (చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు శిక్ష) సెక్షన్ 38 భంగకరమని హైకోర్టు వివరించింది. మరో కేసులో పదేళ్ల శిక్షను నిర్దేశిస్తుంది. విచారణలో జాప్యం జరిగితే సెక్షన్ 43D(5) కింద షరతుల కాఠిన్యం తగ్గిపోయి (!) బెయిల్ ఇవ్వాలని, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ KA నజీబ్, 2021 తీర్పులో వివరించారు. కాని మనదేశంలో ప్రస్తుతం బెయిల్ ఇచ్చిన తరువాత స్టే దారుణం వచ్చింది.

సెక్షన్‌ 16 (ఉగ్రవాద చర్యకు శిక్ష), 17 (ఉగ్రవాద చర్యకు నిధులు సేకరించినందుకు శిక్ష), 18 (శిక్ష) కింద నవ్‌లాఖాపై అభియోగాన్ని విశ్వసించడానికి సహేతుకమైన ఆధారాలు లేవు. సెక్షన్ 20 (ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉన్నందుకు శిక్ష) 39 (ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇచ్చినందుకు నేరం) UAPA ప్రాథమికంగా తేలనందువల్ల బెయిల్‌పై అర్హులు. ఇవి గాక నవ్లాఖా ప్రస్తుతం అనారోగ్య కారణాలతో గృహనిర్బంధం, 3 సంవత్సరాల 8 నెలలకుపైగా జైలులో ఉన్నారు. నవ్‌లాఖాకు సుమారు నాలుగు సంవత్సరాల పాటు జైలు,డిసెంబర్ 19, 2023న బాంబే హైకోర్టు బెయిల్ వచ్చిందని బతికిపోయా రామా అనుకునే లోగానే, NIA పోలీసులు వారిని బంధించి ఉంచాలని కోరుకుంటూ హైకోర్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు మూడు వారాల పాటు బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించింది  ఆశ్చర్యకరం. ఈ ఉత్తర్వు జనవరి 5, 2024న, బాంబే హైకోర్టు గౌతమ్ నవలాఖా కేసులో ఇచ్చారు.  బెయిల్‌పై జస్టిస్‌లు ఎంఎం సుందరేష్, ఎస్‌విఎన్ భట్టిలు సుప్రీంకోర్టు జడ్జిలు స్టేను పొడిగించారు. ఇంత విపరీతమైన అధికారమా అని న్యాయవాదులు అంటున్నారు. ఇది న్యాయం కాదు. రాజ్యాంగం ఇంత విపరీతమైన అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రాధమిక హక్కులకు భంగం రక్షించుకోవల్సిన అవసరం లేదు. ఇటువంటి సంఘటనలు రాజ్యాంగ నేరాన్ని చూపిస్తున్నాయి. ఇది క్రిమినల్ చట్టం సెక్షన్ 43D(5) బెయిల్ నిరోధించే తప్పు. UAPA బెయిల్ చాలా కష్టం.

పోలీసు నివేదిక, కేస్ డైరీ ఆధారంగా మాత్రమే నిందితుడిపై ప్రాథమికంగా కేసు పెట్టారా లేదా అని తెలుసుకోవడానికి జస్టిస్ ప్రయత్నించాలి. ఇదేమీ చేయకుండా సంవత్సరాల తరబడి జైల్లో ఉంచడం మంచిది కాదు. అప్పుడు కూడా పరిశీలించిన సుప్రీం బెయిల్ ఇచ్చిన తరువాత స్టే ఇస్తారా? తన సొంత బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించే పద్ధతి మహారాష్ట్రకు ప్రత్యేకమైనదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్  విమర్శించారు. అసలు సెక్షన్ 482 కింద పిటిషన్ చేయడమే ఆర్టికిల్ 21, 19 లకు వ్యతిరేకం అనీ, ఇటువంటి అరెస్టు స్వేచ్ఛను తగ్గించేఇది.

ఇప్పుడు ఎవరైనా పత్రికలు చదువుతారా, చదవనిస్తారా అనేది ముఖ్యమైన ప్రశ్న. డెమోక్రసీ పట్టాలు తప్పింది, అని ప్రజాకవి కాళోజీ వ్యాఖ్యానించారు. ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అన్న ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 – నవంబరు 13, 2002) వాక్యం చాలా గొప్పది. ఆయన జీవితం నేర్పిన పాఠం ధిక్కారం, అడిగేప్రశ్న.

కాళోజీ ‘నా గొడవ’ లో ఈవిధంగా విమర్శించారు: అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకారాధ్యుడు’, అంటూ ప్రజాస్వామానికి అవమానం జరిగినప్పుడల్లా అతని కలం, గళం ఊర్కోలేద. ‘ప్రజలను హింసించు ప్రభువు మాకేల’ అని ధిక్కరించినవాడాయన. మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles