Tuesday, December 3, 2024

అర్ధ రాత్రి స్వతంత్రం

ప్రపంచీకరణంతో ప్రపంచం

సాంకేతిక గ్రామమై

ఎవరు లాభ పడ్డారో తెలియదు కాని

సామాన్యుడి కి సమస్యలతో

సంగ్రామమై పోయింది !

స్విస్ బంగారు బాతు గుడ్లు

దిగుమతవుతాయని ఖాతాలు

తెరిస్తే వడ్డీ ల వాతలు మిగిలాయి !

అర్ధరాత్రే మాకు అచ్చి వచ్చిన

మూహూర్తం !

అసలు నోట్లు మాయమై

కొత్త నోట్ల పాట్లై రోడ్డన పడ్డాము.

మంచి కాలం ముందు

ఉందేమో

మో” ల మోహం లో పడి

రోజులు గడుపుతుంటే

లాక్ డౌన్ తో వలస కూలీలు

మళ్ళీ రోడ్డున పడ్డారు !

**

అమ్మ కొడుకు పార్టీ లో

ప్రాయానికి గాయమవుతోందనీ

అధిక్షేపించినా

అయ్య గారి ఏలిక లో

ఆరు నెలల పసి నుండి అరవై ఏళ్ళ ముసలీ కి

కీచక పర్వమై

రక్షకులే తక్షకులై

చితుల తో చిద్విలాసం చిందు తారు !

దేశమంతా ఒకే పన్ను విధానం

దరిద్రమంతా ఒకేలా ప్రవాహం !

కాషాయం తో అంతా త్వమేవాహం !

రచ్చ గెలిచి ఇంట చిచ్చు పెట్టడం

అలవాటే

అవినీతీ పోయిందనడం పాత పాటే !

అందుకే

నాదేశానికి అర్ధ రాత్రి స్వతంత్రం

వచ్చింది

ఇంకా తెల్ల వారలేదు !

Also read: నాణానికి మూడో వైపు

Also read: గీటురాయి

Also read: నిర్వికార సాక్షి

Also read: దేవుడా రక్షించు నా దేశాన్ని!

Also read: నగరం

Also read: ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

Also read: మిత్రమా ఇక యుద్ధం అనివార్యమే !

వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles