Friday, December 27, 2024

“స్వేచ్ఛ”—శృoఖలాలు

Khalil Gibran’s –  On Freedom – స్వేచ్ఛానువా దం – డా. సి. బి. చంద్ర మో

————-     ——————

చిత్రవధ  చేసే

నిరంకుశ  ప్రభువు  ముందు

మోకరిల్లి

బానిసలు 

 ప్రశంసావాక్యాలు

పలికినట్లు,

మనలో   కొందరు,

వారి  స్వేచ్ఛకు  వారే

 సాగిల పడి

భజనలు  చేస్తుంటారు!

అవును!

ఆలయ తోటల్లో,

కోటగోడల  నీడల్లో

మనలో  కొందరు అతి  స్వేచ్ఛా జీవులు

మెడకు, కాళ్ళకు

స్వేచ్ఛా‘ సంకెలలు తగిలించుకొని

 తిరుగుతుంటారు!

 ఇది  చూసి

 నా  హృదయం  రక్త  కాసారమౌతోంది!

 స్వేచ్ఛ యే  గమ్యం

 స్వేచ్ఛయే  పరమావధి

  అని మాట్లాడటం

 మానినప్పుడే

 — స్వేచ్ఛా కాంక్ష

 నీకు  ముకు తాడులా  అయి బాధించ నప్పుడే

 నీవు నిజంగా స్వేచ్ఛా జీవి వవుతావు!

 దివారాత్రాలు 

 అతి  జాగరూకతతో

 తీరని  కాంక్షలతో

వేదనతో

 జీవనం  సాగిస్తే

విముక్తుడివి

ఎట్లా  అవుతావు?

సర్ప పరిష్వంగంలా

  శృoఖలాలు

నీ  నడుముకి చుట్టుకున్నా

స్వచ్ఛంగా, స్వేచ్ఛగా

వాటిని   అధిగ మిస్తావు!

ఆత్మ  జ్ఞానోదయంలో

బంధనాలు  ఛేదించుకుంటేనే

దివారాత్రాల

వేదనా  చక్రం

నుంచి  బయట  పడతావు!

సూర్యకాంతిలో

తళుక్కుమంటూ

మిరమిట్లు  గొలిపే

 బలమైన  గొలుసులే

నీవనుకునే

స్వేఛ్చ”—-శృంఖలాలు!

నీవు  కోరుకొనే  స్వేచ్ఛ

నీ  అధీన మయ్యేందుకు

నీ ఆత్మ  శకలాలని

మూల్యంగా  ఇస్తున్నావని

తెలుసా?!

స్వహస్తాలతో 

నుదుట  రాసుకున్న

అన్యాయ  చట్టాలనేగా

నువ్వు రద్దు చేయాలనేది!

న్యాయనిర్ణేతల  నొసళ్లు

అనంత సాగర జలాలతో

అభిషేకించినా,

 చట్టాల చిట్టాలు

తగల బెట్టినా

అవి సమసిపోవు!

ఒక  నియంతని 

పదవీ చ్యుతున్ని  చేయాలంటే

ముందుగా

నీ మనస్సులో  అతనికున్న

పీఠాన్ని  పెకలించేయ్!

నిజమైన 

ఆత్మ గౌరవం,

నిఖార్సైన

స్వేచ్ఛ  — కోరుకుంటే

ఏ నియంత  నిన్ను  ఏలగలడు?

నీ  జాగరూకత 

నీ  నిర్ణయమే.

ఎవరో  నీపై  రుద్దేది  కాదు!

నీ  హదయం

అభయమైతే,

నిన్నెవరు

భయపెట్టగలరు?!

నిశ్చయంగా,

నీ కాంక్షలు,

భయాలు,

నీ ఇష్టాలు,

అయిష్టాలు,

నీ  కొనసాగింపులు,

నిష్క్రమణలు,

అన్నీ,

నీ ఆత్మలోగిలిలో

పరిభ్రమిస్తూనే  ఉంటాయి

వెలుగు నీడల  జంటల్లా

నీలో, ఆడుకుంటూ ఉంటాయి.

నీడ  మాయమవగానే–

వెలుగు  మరో  కాంతికి

నీడ  అవుతుంది!

అలాగే

నీ  ‘ స్వేఛ్చ‘  కాలి బంధనాలు

తెంచుకుంటే–

మరో  స్వేచ్ఛ కు

బంధనమవుతుంది!

Also read: భాషణ

Also read: మనువు

Also read: స్నేహం

Also read: భయం

Also read: అంకురాలు

On Freedom

BY KAHLIL GIBRAN

And an orator said, Speak to us of Free-
dom.
    And he answered:
    At the city gate and by your fireside I
have seen you prostrate yourself and worship
your own freedom,
    Even as slaves humble themselves before
a tyrant and praise him though he slays
them.
    Ay, in the grove of the temple and in
the shadow of the citadel I have seen the
freest among you wear their freedom as a
yoke and a handcuff.
    And my heart bled within me; for you
can only be free when even the desire of
seeking freedom becomes a harness to you,
and when you cease to speak of freedom
as a goal and a fulfilment.

    You shall be free indeed when your days
are not without a care nor your nights with-
out a want and a grief,
    But rather when these things girdle your
life and yet you rise above them naked and
unbound.

    And how shall you rise beyond your
days and nights unless you break the chains
which you at the dawn of your under-
standing have fastened around your noon
hour?
    In truth that which you call freedom is
the strongest of these chains, though its
links glitter in the sun and dazzle your eyes.

    And what is it but fragments of your own
self you would discard that you may become
free?
    If it is an unjust law you would abolish,
that law was written with your own hand
upon your own forehead.
    You cannot erase it by burning your law
 books nor by washing the foreheads of your
judges, though you pour the sea upon them.
    And if it is a despot you would dethrone,
see first that his throne erected within you is
destroyed.
    For how can a tyrant rule the free and
the proud, but for a tyranny in their own
freedom and a shame in their own pride?
    And if it is a care you would cast off, that
care has been chosen by you rather than
imposed upon you.
    And if it is a fear you would dispel, the
seat of that fear is in your heart and not in
the hand of the feared.

    Verily all things move within your being
in constant half embrace, the desired and
the dreaded, the repugnant and the cherished,
the pursued and that which you would
escape.
    These things move within you as lights
and shadows in pairs that cling.
    And when the shadow fades and is no
more, the light that lingers becomes a
shadow to another light.
    And thus your freedom when it loses its
fetters becomes itself the fetter of a greater
freedom.

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles