- వైద్య ఆరోగ్య శాఖతో సింగరేణి ఛైర్మన్ చర్చలు
- సానుకూలంగా స్పందించిన ఆరోగ్య శాఖ
- ఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీలలో ఏర్పాట్లు పూర్తి
సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. సింగరేణి చైర్మన్, ఎం.డి. ఎన్.శ్రీధర్ చూపిన ప్రత్యేక చొరవతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ సూచనల మేరకు సింగరేణి లోని అన్ని ఏరియాల్లో గల ఏరియా ఆసుపత్రులు, డిస్పెన్సరీ లలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు యాజమాన్యం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండవ ఫేజ్ వ్యాక్సినేషన్ లో భాగంగా సింగరేణి లో 45 సంవత్సరాలు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
వైద్య ఆరోగ్య శాఖతో సింగరేణి ఛైర్మన్ చర్చలు:
సింగరేణిలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సింగరేణి సి.అండ్ ఎం. డి శ్రీ.ఎన్. శ్రీధర్ ప్రత్యేక చొరవ చూపి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసి వైద్య పరీక్షలు నిర్వహిచారని కార్మికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అదే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ ను కూడా కార్మికులకు వేయించాలని కార్మికులు కోరారు. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్, ఎండి శ్రీధర్ రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖతో సంప్రదించి సింగరేణి కార్మికులకు వాక్సిన్ వేయాలని కోరారు . దీనిపై సానుకూలంగా స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ సింగరేణి కి లేఖ రాసారు. సింగరేణి వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయడానికి అనువైన ఏరియా ఆస్పత్రులను డిస్పెన్సరీ లను సిద్ధంగా ఉంచాలని కోరారు.
Also Read: సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ల విస్తరణ
ఈ మేరకు సింగరేణి వైద్య శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంత శ్రీనివాస్ ఒక ప్రకటన చేస్తూ ఈ అవకాశాన్ని రెండో ఫేజ్ పరిధి లోకి వచ్చే వయసున్న మరియు కోమార్బిడిటిస్ గల కార్మికులు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తో పాటు కంపెనీ ఇచ్చిన మెడికల్ హెల్త్ కార్డును తీసుకురావాలని సూచించారు .
Also Read: విశ్రాంత జీవితాలకు సింగరేణి వెలుగు