Sunday, December 22, 2024

గొల్ల కుర్మా దేవాలయంలో మాజీ మంత్రి వినోద్ పూజలు..

మాజీ మంత్రి గడ్డం వినోద్ గొల్ల కుర్మల దేవాలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో లోని నెన్నెల మండలం మైలారం గ్రామంలో గొల్ల కుర్మల దేవాలయం ఉంది. బుధవారం మైలారం వెళ్లి అక్కడ దేవాలయంలో జరిగిన పలు పూజా కార్యక్రమంలో వినోద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తో కలిసి పాలు పంచుకున్నారు.. వినోద్ బెల్లంపల్లి లోనే ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు.

former minister vinod offers prayers in golla kurma temple

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి గా బెల్లంపల్లి నుంచి పోటీ చేసి తక్కువ తేడాతో టిఆర్ఎస్ అభ్యర్థి అప్పటికే ఎమ్మెల్యే గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చే ఓటమి పాలయ్యారు.అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కి బెల్లంపల్లి లో గట్టి పునాది ఉంది. సీనియర్ల తో కలిసి పార్టీ ని పటిష్టం చేస్తూ రానున్న ఎన్నికల్లో పోటీకి వినోద్ సిద్ధం అవుతున్నారు. ఈసారి2023లో తిరిగి కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది.ఇందులో భాగంగా నియోజకవర్గంలో ని చిన్నా పెద్దా అన్ని కార్యక్రమాలు లో ఆయన పాలు పంచుకుంటున్నారు.

Also Read : బాధ్యులపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles