చెన్నై : విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను కేంద్ర నేర విభాగం పోలీసులు చెన్నైలో నిన్న అరెస్ట్ చేశారు. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. మహిళలపైనా , సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైనా కొద్ది రోజుల క్రితం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కెర్లు కొట్టింది. ఆ వ్యాఖ్యలకు ఆగ్రహించిన మద్రాస్ హైకోర్టు కు చెందిన న్యాయవాదులు కొందరు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాశారు. ఈ అంశంపై విచారణ కోసం జస్టిస్ కర్ణన్ రెండుసార్లు పోలీసుల ఎదుట హాజరరయ్యారు. అయితే ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడంలేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర డీజీపీని, చెన్నై నగర పోలీసు కమిషనర్ ను మంగళవారం ఆదేశించింది ఈ నేపథ్యంలో మరునాడు ఆయనను అరెస్టు చేశారు.