- అహ్మదాబాద్ పిచ్ చెత్త అంటూ వాన్ విమర్శలు
- బీసీసీఐ అడుగులకు మడుగులొత్తుతోందంటూ ఆందోళన
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండురోజుల్లోనే ముగిసిన టెస్టు పిచ్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడుతున్నాడు. తన టెస్టు కెరియర్ లో ఇలాంటి చెత్త పిచ్ ను చూడలేదని విమర్శించాడు. ఐసీసీ నియమావళికి అనుగుణంగా బీసీసీఐ పిచ్ ను రూపొందించకుండా తన ఇష్టం వచ్చినట్లు తయారు చేయటం ఏమాత్రం సమర్ధనీయం కాదని మండిపడ్డాడు. ఐదురోజులపాటు జరగాల్సిన టెస్టు మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసిపోడం, 450 ఓవర్లపాటు సాగాల్సిన మ్యాచ్ కేవలం 842 బాల్స్ కే పరిమితం కావడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించాడు.
Also Read: పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ డింకీలు
బీసీసీఐ అడుగులకు ఐసీసీ మడుగులొత్తుతోందని మండిపడ్డాడు. టెస్టు మ్యాచ్ తొలిరోజుఆట మొదటి గంటలోనే బంతి బొంగరంలా స్పిన్ కావటం చరిత్రలో ఇదే మొదటిసారని గుర్తు చేశాడు.రెండురోజుల ఆటలో ఒక్కజట్టూ 150 స్కోరు సాధించలేకపోడం విడ్డూరమని, అదేమంటే బ్యాట్స్ మన్ వైఫల్యమంటూ సమర్థించుకోడం ఎంతవరకూ న్యాయమని నిలదీశాడు.
Also Read: డే-నైట్ టెస్టు తొలిరోజునే వికెట్లు టపటపా
చెన్నైలో ముగిసిన రెండుటెస్టు నుంచి భారత పిచ్ ల పట్ల అసంతృప్తివ్యక్తం చేస్తున్న వాన్ అహ్మదాబాద్ మూడోటెస్టు పిచ్ తీరుతో మరింత పిచ్చెత్తిపోయాడు.బీసీసీఐ పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఏదోఒకటి చేయాలని పట్టుబట్టాడు.1934-35 తర్వాత అత్యంత స్వల్పసమయంలో ముగిసిపోయిన టెస్టుగా అహ్మదాబాద్ రికార్డుల్లో చేరింది.