- 2021 సీజన్ వేలంలో హర్భజన్ సింగ్
ఐపీఎల్ లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో హర్భజన్ సింగ్ రెండేళ్ల కాంట్రాక్టు ముగిసింది. ఈ విషయాన్ని భజ్జీనే స్వయంగా మీడియాతో పంచుకొన్నాడు. ఐపీఎల్ తో తన రెండేళ్ల కాంట్రాక్టు ముగిసిందని, చెన్నై జట్టు సభ్యుడిగా తనకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయని, మరికొంతమంది కొత్త స్నేహితులను సంపాదించుకోగలిగానని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కరోనా భయంతో గల్ఫ్ దేశాలు వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలకు దూరంగా ఉన్న భజ్జీకి చెన్నై తరపున ఆడిన 24 మ్యాచ్ ల్లో 23 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.
ఇది చదవండి: భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర
ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో హర్భజన్ ను 2 కోట్ల రూపాయల ధరకు చెన్నై ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. ఐపీఎల్ లో తన కెరియర్ ప్రారంభంలో ముంబై ఫ్రాంచైజీ తరపున భజ్జీ 10 సంవత్సరాలపాటు సేవలు అందించాడు. జనవరి 20తో తన కాంట్రాక్టు ముగిసిందని, తనను కొనసాగించే విషయమై ఫ్రాంచైజీ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని భజ్జీ తెలిపాడు. రెండుసీజన్ల పాటు తనకు అవకాశమిచ్చి ప్రోత్సహించిన చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యానికి భజ్జీ కృతజ్ఞతలు తెలిపాడు.
ఇది చదవండి: భారత్ తో సిరీస్ బంపర్ హిట్