సాధారణంగా రైలు ప్రయాణంలో వివిధ కారణాలచేత మన వస్తువులను కోల్పోవడం సహజం. పోయిన వస్తువులు తిరిగి దొరకడం చాలా కష్టం. అలాంటిది ఒక చిన్నారి పోగొట్టుకున్న బొమ్మ కోసం తోటి ప్రయాణికుడు , రైల్వే శాఖ సిబ్బంది ఎంతో కష్టపడి దొరకబట్టి స్వయంగా ఇంటికే వచ్చి అప్పగిస్తే ఎలాగుంటుంది ?. అప్పుడు అచిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
Also read: కాంగ్రెస్ ఒంటరి పోరు!..2024 కాంగ్రెస్ దేనట!
జనవరి 4న భుసిన్ పట్నాయక్ అనే ప్రయాణీకుడు రైలు నం. 07030, సికింద్రాబాద్-అగర్తలా ప్రత్యేక రైలులో “కోచ్ నంబర్ B-2, సీటు నంబర్-10,11 ప్రయాణం చేసాడు. ఈ క్రమంలో తన తోటి ప్రయాణికుడి ఒక చిన్నారి కుమార్తె కుడా వారితో ఉంది. అనుకోని పరిస్థితిల్లో ఆ చిన్నారి తనకు ఎంతో ఇష్టమైన ఒక బొమ్మను పోగొట్టుకొని ఆ బొమ్మ కోసం రోదిస్తూ వున్నది .ఈ ఘటనను గమనించిన భూసిన్ పట్నాయక్ ఎలాగైనా ఆ చిన్నారి పోగొట్టుకొన్న బొమ్మను అందించాలని ఆలోచిస్తున్న క్రమంలో అతనికి ఒక ఆలోచన తట్టింది. రైల్వేలో మదద్ అనే యాప్ ద్వారా 139 అనే నెంబర్ కు ఫోన్ చేసి ఈ విషయాన్ని చేరవేశాడు. తన ఫిర్యాదులో ప్రయాణికుడు పేరు తెలియదు అలాగే అతని వివరాలు ఏ మాత్రం తెలియవు. అయినా ఈ విషయాన్ని తేలికగా తీసిపారవేయకుండా మానవతా దృక్పధంతో ఆలోచించిన రైల్వే శాఖ సిబ్బంది, పిర్యాదు దారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆ చిన్నారి కుటుంబానికి సంబందించిన వివరాలను రాబట్టే పనిలో తనముకలై ఎంతో శ్రమించారు. కేవలం బెర్త్ నెంబర్ చెప్పడం ద్వారా ప్రయాణికుల వివరాలు చిరునామా రాబట్టడం అనేది చాల కష్టంతో కూడుకున్న పని.
అయినా చిన్నారికి ఎలాగైనా ఆ బొమ్మను అందించాలని చేసిన ప్రయత్నం భాగంగా సదరు చిన్నారి తండ్రి వివరాలు అతి కష్టం మీద రాబట్టగలిగారు. సికింద్రాబాద్ రైల్వే కౌంటర్ ద్వారా రిజర్వేషన్ చార్ట్ నుండి అతి కష్టం మీద చిరునామా ప్రయాణికుడి పూర్తి వివరాలు రాబట్టడంలో సఫలీకృతమయ్యారు.
Also read: బెదిరించి…తరలించి… సాధించిందేమిటీ?
మరోవైపు చిన్నారి పోగొట్టుకున్న బొమ్మను రైల్వే శాఖ సిబ్బంది న్యూ జల్పాయ్ గురి స్టేషన్ సమీపంలో కనుగొన్నారు. దీంతో ఆ చిన్నారికి పోగొట్టుకున్న బొమ్మను ఎలాగైనా అందించాలని నిర్ణయించారు. చిన్నారి తల్లిదండ్రులు మోహిత్ ర్జా, నస్రీన్ బేగం నివసిస్తున్న ఉత్తర్ దినాజ్ పూర్ జిల్లా ఖాజీ గావ్ లోని ఇంటికి వెళ్లి ఆ చిన్నారికి బొమ్మను అందించారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్బంగా చిన్నారి పోగొట్టుకున్న బొమ్మను రైల్వే కు పిర్యాదు చేసి ఆ చిన్నారి ముఖంలో ఆనందానికి కారణమైన భుసిన్ పట్నాయక్, రైల్వే సిబ్బంది కృషిని ఈ సందర్బంగా పలువురు అభినందించారు.