Thursday, December 26, 2024

ఆహారము, గుణము

భగవద్గీత – 59

Food and mood…

రుచికరంగా, రసయుక్తంగా, స్నేహకరంగా ఉండి దాని సారం దేహంలో స్థిరంగా ఉండేది మరియు చిత్తాన్ని సంతృప్తం చేసేది అయిన ఆహారం సాత్త్వికస్వభావులకు ఇష్టమైనది, లేదా అలాంటి ఆహారం భుజిస్తే సాత్త్వికస్వభావం అలవడుతుంది.

Also read: నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి?

భగవద్గీత 17 వ అధ్యాయం 8, 9, 10 శ్లోకాలు ఒక్కసారి చూడండి ఏం చెపుతున్నాయో.

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః

సాత్వికులకు ప్రీతికలిగించే ఆహారపదార్థాలు ఇవి: ఆయుర్దాయం, బుద్ధిబలం, శరీరబలం, ఆరోగ్యం, సుఖం, సంతోషం. వీటిని వృద్ధిచేస్తూ రసమూ, చమురూ కలిగి, చాలాకాలం ఆకలిని అణచిపెట్టి, మనసుకు ఆహ్లాదం కలగజేసేవి.

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః

ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః

బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారం కలిగి, చమురు లేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహారపదార్థాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనసుకు వ్యాకులత, వ్యాధులు కలగజేస్తాయి.

Also read: విశ్వరూపము దర్శించగలమా?

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్‌

ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్‌

తామసులకు చల్లబడిపోయింది, సారంలేనిది, వాసనకొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారమంటే ఇష్టం.

ఈ క్రింది సమాచారం American heart association వారిచ్చినది.

Have you ever felt hangry (hungry+angry)? Food and mood have an effect on one another. Understand how they interact so you can make good diet choices and avoid emotional or impulse eating.

ఇక హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వారు చెప్పిన విషయం కూడా చిత్తగించండి.

A 2014 study in Brain, Behavior, and Immunity that used data from the Nurses’ Health study did find an association between depression and a diet rich in sugar-sweetened soft drinks, refined grains, and red meat, says Chocano-Bedoya.

Similarly, a 2018 meta-analysis published in the European Journal of Nutrition suggested that high consumption of meat could be associated with risk of developing depression.

వేల సంవత్సరాల క్రితమే ఉన్న భారతీయుడి అవగాహన ఇది.

Also read: కాలస్వరూపం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles