అక్షర క్షేత్రం కవులుకు తీసుకొన్న కవిని
కాస్త చేలలో అటు ఇటుగా
చేతనయినంత తేట తెలుగు కవిత
ఇంకాస్త పొలంలో ఇంగ్లిష్ పోయెమ్
రెండు పండిస్తా.
విత్తు నేనే, నీరు నేనే
హలము నేనే, హల చోదకుడినీ నేనే
ఎరువు నేనే, పురుగుల మందు నేనే
కలుపు నేనే, కంకి నేనే…
కాని పంట మాత్రం నాది కాదు
పండితోత్తములారా!
దంచి, వండి తిని బాగుందన్న
గింజ పుచ్చు దనో, ఉడకదనో అన్నా
తప్పు నాది కాదు అన్నలారా…
షోలే లో సోషలిజం,
అడవి రాముడు లో అద్వైతం…
హన్నా… ఉండవన్నా!
ఇక్కడ సరుకు అంతే…
ఎటునుంచి లెక్క వేసినా సున్నా!
Also read: చవుడు భూమి
Also read: పాత కథ
Also read: చరిత్ర
Also read: భాష్పాంజలి
Also read: చందమామ