వాల్మీకి గండ పెండేరం
బరువెంత?
వ్యాసుడి కి కప్పిన శాలువాలు ఎన్ని?
దండి కి ఇచ్చిన డాక్టరేట్లు,
పాణిని కి వచ్చిన పట్టాలు
భవభూతి కి చేసిన సన్మానాలు
…ఈ లెక్కలు ఎక్కడ?
చరిత్ర పుటలలో వాటి చప్పుడే లేదు.
అయిన ఎప్పటెప్పటో
సాహితీ వసంతాల సౌరభాలు
ఇప్పటికి మత్తెక్కిస్తున్నాయి
…ఎందుకో?
మరేం… గుడ్డ ముక్కలు చిరిగిపోవా,
బంగారం కరిగిపోదా,
చప్పట్లు గాలిలో కలిసిపోవా?
కాలానికీ ఎరుకే
క్షీర నీర న్యాయం.
Also read: కత్తులు, కరవాలాలు
Also read: జీవన సంధ్య
Also read: ఆకాశ హర్మ్యం
Also read: బాస
Also read: సుదీర్ఘ ప్రయాణం