——-
( Khalil Gibran
‘Fear ‘కు స్వేఛ్చానువాదం )
సి .బి .సి .మోహన్
———
సాగరంలో విలీనమయ్యే వేళ
నదీమ తల్లి ఆకులా వణికి పోతుంది
కొండలు ,అడవులు ,కుగ్రామాలు
దాటుకుంటూ
వయ్యారంగా మెలికలు తిరుగుతూ
తానొచ్చిన త్రోవను ఒక్కసారి
వెనక్కి తిరిగి చూసుకుంటుంది
— ముందేమో మహా సాగరం
దానిలో విలీనమవటం అంటే
తనను తాను కోల్పోవటమే !!
— కాని వే రే మార్గం లేదు
నది తన మార్గం మార్చుకోలేదు
ఆ మాట కొస్తే నది మాత్రమే కాదు
ఎవ్వరూ గతం లోకి
తమ మార్గాల్ని మరలించుకోలేరు .
అది మన అస్తిత్వంలో అసాధ్యమైన పని !!
సాగర సంగమం తప్ప
నదికి అన్యధా శరణం నాస్తి !!
ఎందుకంటే
— తాను అస్తిత్వాన్ని కోల్పోవడం లేదు,
తానే సాగర మవుతున్నానని —
అప్పుడే నది తెలుసుకుంటుంది .
— అప్పుడే నది తన భయాన్ని
రూపు మాపుకుంటుంది —
Also read: అంకురాలు
Also read: మెల్లగా … మృత్యు ముఖంలోకి
Also read: ఓ…..మనిషీ!!
Also read: బంధన ఛేదిత – ఊర్వశి