Sunday, December 22, 2024

పాండ్యా బ్రదర్స్ కు పితృవియోగం

  • గుండెపోటుతో మరణించిన హిమాంశు పాండ్యా

భారత క్రికెట్ స్టార్ ఆల్ రౌండర్ బ్రదర్స్ హార్థిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. 71 సంవత్సరాల హిమాంశు పాండ్యా గుండెపోటుతో బరోడాలో మృతి చెందారు.

ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 క్రికెట్ టోర్నీలో బరోడాజట్టుకు నాయకత్వం వహిస్తున్న కృణాల్ పాండ్యా…తనతండ్రి మరణవార్త తెలిసిన వెంటనే..బయోబబుల్ వాతావరణం నుంచి బయటకు వచ్చి ఇంటికి చేరుకొన్నాడు.

మరోవైపు ఇంగ్లండ్ తో సిరీస్ కు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న హార్ధిక్ పాండ్యా మాత్రం తండ్రి మృతి చెందిన సమయంలో చెంతనే ఉన్నాడు. పాండ్యాసోదరులను క్రికెటర్లుగా తీర్చిదిద్దడానికి హిమాంశు పాండ్యా ఎంతగానో కష్టపడ్డారు. ఆయన త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా ఇద్దరు కుమారులు భారతజట్టు తరపున ఆడటమే కాదు..ఐపీఎల్ ద్వారా ఏడాదికి 10 కోట్ల రూపాయలకు పైగా ఆర్జిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles