Wednesday, January 22, 2025

నాన్నకి తెలిసినది

నాన్న కి వాట్సాప్ తెలీదు

నాన్న కి ఫేస్ బుక్ తెలీదు

కనీసం ఈ మెయిల్ కూడా తెలీదు

నాన్న కార్డు కాలం నాటి వాడు !

నాన్న లాంతరు వెలుతురు లో చదివిన వాడు

నాన్న కాలినడక నే కాశీ వెళ్ళిన వాడు !

నాన్న పొలం గట్టు పై శయనించిన వాడు

నాన్న గాంధీ గారిని చూసిన వాడు

నాన్న కి చాలా తెలియదు

నాన్న కి ఒకటి తెలుసు

అది మాకెవరికీ తెలియదు

నాన్న కి ప్రేమించడం తెలుసు

ఇప్పటికీ ఆ ప్రేమ రహదారి చిరునామ

మాకు తెలియదు !

Also read: ఇలా మిగిలాం !

Also read: అర్ధ రాత్రి స్వతంత్రం

Also read: నాణానికి మూడో వైపు

Also read: గీటురాయి

Also read: నిర్వికార సాక్షి

వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles