Saturday, December 21, 2024

కేంద్ర ప్రభుత్వం విషవలయంలో భారత రైతులు, ప్రాంతీయ పార్టీలు – వ్యవసాయ రంగంలో అభివృద్ధి 

           పెద్దిరెడ్డి చంగల్ రెడ్డి

            వ్యవసాయానికి ఉచితంగా నీరు , కరెంటు ,నగదు సహాయం ఇస్తున్నారు. ఎరువులు తక్కువ ధర, బ్యాంకు రుణాలు కనీస వడ్డీతో అందుబాటు చేశారు. ప్రాజెక్టులు కట్టిస్తున్నారు. కానీ రైతులు సాగు చేసేందుకు భయపడుతున్నారు .అనేక ప్రాంతాలలో పంట పండించటం నిలిపివేశారు. రైతులు పండిస్తున్నారు. కానీ లాభసాటిగా లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రైతులు సంతోషంగా లేరు. వ్యవసాయం ఎందుకు లాభసాటిగా ఉండటంలేదు?  ఈ ప్రశ్నకు జవాబు రైతులకు తెలియదు!  మేధావులకు అర్థం కాదు! ప్రభుత్వాలు పట్టించుకోవు!

  1. ప్రతి సంవత్సరం ఎంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి ప్రభుత్వానికి? విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఆస్పత్రులు,  హోటల్లు,సిమెంటు,స్టీల్ పరిశ్రమలు ఆయా సంఘాల అధిపతుల అవసరమైన మేరకు ఏర్పాటు చేసుకుంటారు. మన దేశంలో  ఏ పంట ఎంత పండించాలి? ఎంత నిలువ చేయాలి? ఎంత మేరకు పరిశ్రమలకు వాడాలి? ఎంత ఎగుమతి చేయాలి?    ఈనాటి వరకూ ప్రాతిపదిక లేదు? వ్యవసాయ ఉత్పత్తి ప్రణాళికల విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదు.
  2. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం  రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత  అని గత 75 సంవత్సరాలుగా అందరి అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వాలు పంట పండించేందుకు అవసరమైన నీరు, కరెంటు, రుణాలు, విత్తనాలు, తదితర సదుపాయాలు కలుగజేశారు.  ఇటువంటి వసతులు కలుగజేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు వారి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాయి.
  3. రైతు పంటను పంటకు అధిక ధర రావటానికీ, నాణ్యత పెంచడానికీ, ఎగుమతి చేయటానికీ అవసరమైన చర్య తీసుకోవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్ర ప్రభుత్వాలు అనేక రైతు వ్యతిరేక విధానాలను రూపొందించి వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయికి  పెరుగుదల లేకుండా అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల అణగదొక్కడానికి విధానాలు రూపొందించి అడ్డుకుంటున్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుంది. కానీ అది శాస్త్రీయ పద్ధతిలో లేదు. ధరల నిర్ణయం కమిటీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని 30 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అడ్డుకున్నది. పురుగుమందులు ధరలను అదుపు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. వీటిపై 18 శాతం ట్యాక్స్ విధించారు. డీజిల్ ధర 100% పెంచారు. దీర్ఘకాలిక ఎగుమతులకు విధానాన్ని రూపొందించలేదు. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల టన్నుల గోధుమలు ఉన్నా ఎగుమతిపై నిరంతరం అభ్యంతరాలు తెలియజేస్తూ ఆంక్షలు విధిస్తున్నారు. జన్యుమార్పిడి పంటలను భారత రైతులకు అందుబాటులోకి తేలేదు. అమెరికా, బ్రెజిల్, తదితర దేశాలలోరైతులు పండించిన, జన్యు మార్పిడి సోయా తదితర పంటల దిగుమతులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇచ్చింది.
  4. భారత ప్రభుత్వం పప్పుదినుసులు దిగుమతులకు దీర్ఘకాలిక ఒప్పందాలు ఆఫ్రికా దేశాలతో చేసింది. ఆ పద్ధతిలో బియ్యం , గోధుమలు, ప్రతత్తి, తదితర పంటలను ఎగుమతులు చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు. రక్షణ, ఆరోగ్య, రవాణా, తదితర రంగాలలో అంతర్జాతీయ పరిశ్రమల పెట్టుబడులకు, కొత్త సాంకేతిక అమలుకు అనుమతించారు.వ్యవసాయ రంగంలో ఇతర దేశాలలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రైతులకు రానీకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది.
  5. ఈ లోపాల వలన ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయిలో లేదు. నాణ్యత లో అనేక లోపాలు ఉన్నవి. వ్యవసాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచడానికి అవసరమైన సాంకేతిక విజ్ఞానాన్ని ,పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచడానికి గత 30 సంవత్సరాలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి ముఖ్య కారణంలో జాతీయ పార్టీల నాయకత్వం వ్యవసాయ అభివృద్ధి, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు. కేంద్ర ప్రభుత్వ ఎగుమతి దిగుమతుల విధానాలను దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రభావితం చేస్తారు. దీనికి నిదర్శనం చక్కెర ఎగుమతి దిగుమతులు , నూనె దిగుమతులు విధానాలు.
  6. ప్రస్తుతం అధిక ఉత్పత్తి చేసి పతనమవుతున్న రైతుల సమస్యల పరిష్కారం దేశంలో పంటల వారీగా ప్రణాళికలు తయారు చేయాలి. ఈ ప్రణాళికలు జిల్లాలవారీగా, రాష్ట్రాలవారీగా దేశ స్థాయిలో ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాల్సిన అవసరం .  ఈ ప్రణాళికలు రూపొందించటంలో శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ఎగుమతిదారులు కలిసి చర్చించి ప్రణాళికలు రూపొందించాలి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇటువంటి ప్రణాళికలు తయారు చేసి అమలు చేయగలవనే నమ్మకం లేదు. కాంగ్రెస్ రాజస్థాన్లో జరిగిన జాతీయ సమావేశం , బీజేపీ హైదరాబాదులో చేసిన జాతీయ సమావేశంలో వ్యవసాయ అభివృద్ధికి , రైతుల సంక్షేమం చర్చించలేదు. 
  7.  ప్రాంతీయ పార్టీలు వ్యవసాయ కేంద్రీకృత ఆర్థిక విధానాన్ని రూపొందించగలిగితే తప్పక దేశంలో రైతులు వ్యవసాయ రంగంలో అభివృద్ధి పొందగలేరు. ఇటువంటి ప్రణాళిక రాజకీయంగా ప్రాంతీయ పార్టీల ఐక్యతకు ఉపయోగపడుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles