Thursday, November 7, 2024

కేంద్ర మంత్రులతో రైతు నేతల చర్చలు బుధవారం

దిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసనదీక్ష చేస్తున్న రైతు సంఘాల నాయకులు బుధవారంనాడు మంత్రిమండలి ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నది. హరియాణా, పంజాబ్ రైతులు ప్రదానంగా నాయకత్వం వహిస్తున్న ఈ ఉద్యమంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల రైతులు కూడా విరివిగా పాల్గొంటున్నారు. ‘దిల్లి చలో’ పేరుతో నవంబర్ 26న ఆరంభమైన ఉద్యమం మంగళవారంనాడు 33వ రోజులో అడుగుపెట్టింది.

ఇది చదవండి : రైతు ఉద్యమంపై ఎవరి మాట వారిది

వ్యవసాయరంగంలో సంస్కరణలు అనివార్యం: ప్రధాని

వ్యవసాయరంగంలో సంస్కరణలు పెట్టాలనే సంకల్పం, ఉద్దేశాలు పారదర్శకంగా ఉన్నాయనీ, రైతులు తమ మేలు ఏమిటో అర్థం చేసుకోవాలనీ, సంస్కరణలు అనివార్యమనీ ప్రధాని నరేంద్రమోదీ సోమవారంనాడు మహరాష్ట్రలోని సింగోలా నుంచి పశ్చిమబెంగాల్ లోని షాలిమార్ వరకూ వెళ్ళే కిసాన్ రైలుకు పచ్చజెండా ఊపిన తర్వాత అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా 40 రైతుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ. ఈ సంస్థ కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ పంపిన ఆహ్వానాన్ని పరిశీలించి చర్చలలో పాల్గొనాలని నిర్ణయించింది. కాగా, కార్యదర్శి రాసిన లేఖాంశాలు అంటీముట్టనట్టు, ఏమీ స్పష్టంగా చెప్పకుండా, కప్పదాటు వ్యవహారంగా ఉన్నదని కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు వ్యాఖ్యానించారు.

ఇది చదవండి : ఉధృతంగా కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు

అమిత్ షా నాయకత్వం

ఇంతవరకూ జరిగిన చర్చలలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంత్రుల బృందానికి నాయకత్వం వహించారు. బుధవారంజరిగే చర్చలలో హోంమంత్రి అమిత్ షా మంత్రుల బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఉన్నదని భోగట్టా. ఈ లోగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడూ, సమాజ్ వాదీ పార్టీ వరిష్ఠ నాయకుడూ  రాం గోవింద్ చౌధురి రైతుల ఉద్యమాన్ని ‘ఆర్ –పార్ కీ లడాయీ’ (చావో రేవో తేల్చుకునే ఉద్యమం) అని అభివర్ణించారు. ఆయన నిరసన తెలుపుతున్న రైతులను ఉద్దేశించి సోమవారంనాడు మాట్లాడారు.

ఇది చదవండి : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి : కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఇది చదవండి : నిరసనలు తెలిపే హక్కు రైతులకుంది-సుప్రీంకోర్టు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles