వలస ఒక అనాది యాత్ర
వలస ఒక పురాతన జాతర
జీవన నేపథ్యం
రంగు మారినపుడు
వలస ఒక ఆయుధం
మేఘం కన్నెర్ర చేసి
చినుకు కరువు చేస్తే
అన్నదాత కడుపు చేత పట్టుకుని
ఊరు వలసవుతుంది
రైతు బతుకు కూలీ అవుతుంది
వలస ఒక జాతిని తరలిస్తుంది
వలస బ్రతుకు దారిని మార్చేస్తుంది
వలస జీవితంలో ఒక్కోసారి
సుడిగుండమై తిరుగుతుంది
ఒకోసారి తుఫానై ముంచేస్తుంది
జానెడు పొట్ట కోసం
ఖండాంతర యానం చేయిస్తుంది
జాతి లేదు మతం లేదు
ఆకలిది విశ్వభాష
ఎక్కడైన విడిది చేస్తుంది
ఏ పనైనా చేయిస్తుంది
కడుపు నింపే దాక చేయి చాస్తుంది
ఒక చీకటి ఖండం మీద నుంచి
ఒక వెలుగు వేదిక మీదకు
ఒక మంచుదేశం నుంచి
ఒక ఉష్ణ ప్రాంతం వరకు
ఋతువుల వంతెన కడుతుంది.!
Also read: ఫ్లెమింగో-1
Also read: ఫ్లెమింగో-2
Also read: ఫ్లెమింగో-3
Also read: ఫ్లెమింగో-4