• ఆశావహుల్లో నెలకొన్న సందడి
• విజయం కోసం పక్కా ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నాలుగు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. పురపాలక సంఘాల పదవీకాలం ఈ సంవత్సరం మార్చి 15తో ముగియనుంది. ఆలోపే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.
పునర్విభజనపై తర్వాతే ఎన్నికలు:
ఎన్నికలకు ముఖ్యమైన వార్డులు, డివిజన్ల పునర్విభజన పూర్తిచేయాలని పురపాలక శాఖను ఎన్నికల సంఘం కోరింది. రెండు గ్రేటర్ కార్పొరేషన్ల పాలకవర్గాలకు సిద్ధిపేట, అచ్చంపేట నకిరేకల్, కొత్తూరు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వరంగల్ ఖమ్మం అచ్చంపేట పాలకవర్గాల గడువు మార్చి15తో ముగియనుంది. సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 16 వరకు ఉంది. కొత్తూరు కొత్త పురపాలక సంఘంగా ఏర్పాటైంది. వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నిలక సంఘం భావిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీచేసి మార్చి లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టం తో వార్డులు, డివిజన్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యలో జనవరి 15 లోపు వార్డుల పునర్విభజన పూర్తయితే ఆమేరకు ఓటర్ల జాబితాలను ఖరారుచేసే అవకాశం ఉంది.
ఇది చదవండి: బిజెపి దూకుడుకు కేసీఆర్ కళ్ళెం వేస్తారా?
ఆశావహుల్లో సందడి:
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకున్నా ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. గెలుపోటములు బేరీజు వేసుకుంటూ ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటినుండే ఎన్నికలకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకునే వేటలో పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇక్కడ కూడా విజయం సాధించేందుకు తన వ్యూహాలకు పదునుపెడుతోంది.
ఇది చదవండి: టీఆర్ఎస్ లో ఏమి జరుగుతోంది?
టీఆర్ఎస్ పక్కా వ్యూహం:
దుబ్బాకఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గెలుపుగుర్రాలను బరిలో దించాలని భావిస్తోంది. బీజేపీ విమర్శలను తిప్పికొట్టేందుకు తగిన వ్యూహాలను పక్కాగా రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: రైతు ఉద్యమంపై కేసీఆర్ యూటర్న్