————————
( ‘ EXCHANGE ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )
తెలుగు అనువాదం:డా. సి.బి. చంద్ర మోహన్
49. సంచారి తత్త్వాలు
—————–
ఒకసారి ఒక కూడలిలో ఒక పేద కవి ఒక తెలివి తక్కువ ధనికుని కలుసుకున్నాడు. వారు మాట్లాడుకున్నారు. వారు మాట్లాడుకున్నదంతా వారి అసంతృప్తిని మాత్రమే బయట పెట్టింది.
అప్పుడు, మార్గ దేవ దూత అటుగా పోతూ ఆగి, వారిద్దరి భుజాలపైన తాను చెయ్యి వేసాడు.
ఇక , చూడండీ! ఒక అద్భుతం జరిగింది : వారిద్దరూ వారి సంపదలను మార్పిడి చేసుకున్నారు.
ఇద్దరూ విడిగా వెళ్లి పోయారు. అప్పుడు ఒక వింత జరిగింది. కవి తన చేతిలో జారి పోయే పొడి ఇసుకను కనుగొన్నాడు. ఆ తెలివి తక్కువ ధనికుడు కళ్ళు మూసుకుంటే తన మనసులో మేఘం కదులుతూ ఉన్నట్లు భావించాడు.
Also read: ప్రవక్త
Also read: మతం
Also read: ఇసుక పైన
Also read: దేహము– ఆత్మ
Also read: మరణం