Sunday, December 22, 2024

కేసీఆర్ ది రైతులకూ, ఉద్యమకారులకూ వ్యతిరేక ప్రభుత్వం – చేర్యాలమాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

  • స్వరాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారు
  • రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు మరణాలు సంభవిస్తూన్నా చలించని కేసీఆర్
  • పంటసాగు విషయంలో గడియకోమాట మాట్లాడూతు రైతు ఊసురు తీసుకుంటున్న సర్కార్
  • సమైక్య రాష్ట్రంలో సైతం రైతులు టోకెన్ల కొసం నిలబడలేదు
  • కేసీఆర్ సంబ్బండవర్గాల ఉసరు తాకడం హుజరాబాద్ తో ప్రారంభంమైంది
  • ఇకనైనా కళ్లు తెరవకపోతే చరిత్రహీనుడిగానే కేసీఆర్ మిగిలిపోతారు

ఉద్యమాలతో ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రన్ని కేసీఆర్ సర్వనాశం చేశారని చేర్యాల  మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లల్లాడుతుంటే ధాన్యం కొనాలంటే టోకెన్లు తీసుకుని అమ్మే దుస్థికి తీసుకువచ్చారని అయన అవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో మామిడి బీరయ్య అనే రైతు 10  రోజుల క్రితం తను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఆకాల వర్షానికి  తడిసి ముద్దైన ధాన్యాన్ని చూసి చలించి అక్కడే ప్రాణాలు కొల్పోవడమంటే ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధత, కేసీఆర్ చేతకానితనానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చేప్పుకోవడంకాదనీ, రైతులను అన్నిరకాలుగా అదుకోవాలనీ అన్నారు. ఇప్పటికే చాలా కేంద్రాల్లో వడ్లు కొనుగోలు మొదలు కాలేదని వర్షం వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సమైక్యరాష్ట్రంలో సైతం  రైతు ఇంతగా పీడనకు గురికాలేదని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమకారుల రైతులు,నిరుద్యోగుల,సబ్బండ వర్గాల ఊసురు తగలడం మొదలైందనీ, అది హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలనుండే  ప్రారంభమైందనీ అన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు కొరకు అనేక ఉద్యమాలు చేసిన అసలైన ఉద్యకారులు కాదని ఉద్యమ ద్రోహులను, కుల బంధువులను అందలం ఎక్కించి రాక్షాసానందం  పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చేప్పారని అన్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి, తెలంగాణ భవన్ నిర్మాణానికి రాళ్లెత్తిన తెలంగాణ వాదులను ఒక్కొక్కరిగా బయటకు పంపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు ఇచ్చి అసలైన ఉద్యమకారలకు ద్రోహం చేసినందుకే తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి రగులుతుంది.సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరుతుందని చెప్పిన పెద్ద మనిషి రెండు సార్లు తెలంగాణ ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి అయ్యి అనేక రంగాలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నీళ్లు ,నిధులు, నియామకాలు కొరకై ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందంటే  అయన స్వార్థపూరిత బుద్ది బట్టబయలైందని చేప్పారు.నిరుద్యోగులకు ఉద్యాగాలు లేవు, ఉద్యోగులకు జీతాలు కూడా జిల్లాలకు ఆల్ఫాబెటికల్ ఆర్డరులో ఇచ్చే దుస్థితకి ఈ ప్రభుత్వం నెట్టివేశారని అన్నారు.

ఉద్యమ సమయంలో చేసిన వాగ్ధానాలను, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కి ఏ ఒక్క వాగ్ధానము అమలుచేయని వ్యక్తిగా ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోయారని చేప్పారు. ‘‘రైతులకు ఒక సారి మొక్కజొన్న వేయోద్దని, ఇప్పుడు వరి వేయోద్దని చెబుతూ రైతులకు ద్రోహం చేస్తూన్నారు. మరి వరి వద్దని చేప్పిన కేసీఆర్ లక్షల కొట్లతో  ప్రాజెక్టులు కట్టడంలో అంతర్యం ఏమిటో ప్రజలకు చేప్పాలి’’ అని ప్రశ్నించారు. కేవలం  కమీషన్ల కొసం ప్రాజెక్టలు కట్టడానికి ఆప్పలు చేస్తూ అప్పుల తెలంగాణగా మారుస్తూన్నారని అరోపించారు. తెలంగాణ అమరుల సమాధుల పునాదుల మీద రాజ్యమేలుతూ అడుగడుగునా పక్షపాతం, బందుప్రీతి, అవినీతిలో తెలియాడుతూ సబ్బండ వర్గాలు పోరాడితే వచ్చిన తెలంగాణను వాడుకొని బెల్టు షాపు పెట్టి ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నవ్వుల పాలు చేస్తూ పరిపాలన కొనసాగుస్తూన్నారన్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరిచి తెలంగాణ వాదులనూ, రైతులనూ, ఉద్యమ సమయంలో పోరాడిని నాయకులనూ ఆదరించి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్దికి తొడ్పడాలని కొమ్మూరి హితువు పలికారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles