Thursday, December 26, 2024

సమఉజ్జీల సమరానికి అంతా సిద్ధం

* ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో చెరి సగం
* టీ-20ల్లో టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్, రెండో ర్యాంకర్ భారత్

భారత్ వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా.. ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, రెండోర్యాంకర్ భారతజట్ల ఐదుమ్యాచ్ ల సిరీస్ కు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్, విరాట్ కొహ్లీ కెప్టెన్సీలోని భారతజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.

Also Read : టీ-20 సిరీస్ లో అతిపెద్ద సమరం

భారత్ 7- ఇంగ్లండ్ 7

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్- ఇంగ్లండ్ జట్ల్లు ఇప్పటి వరకూ 14సార్లు తలపడ్డాయి. చెరో 7 విజయాలతో సమఉజ్జీలుగా నిలిచాయి.

Everything is ready for the battle of India with England in t 20 series

తటస్థ వేదికల్లో ఇంగ్లండ్ తో తలపడిన రెండుకు రెండుసార్లూ భారతజట్టే విజేతగా నిలిచింది.
2007 డర్బన్, 2012 కొలంబో టీ-20 మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ ను భారత్ కంగు తినిపించింది.
భారత్ వేదికగా ఈ రెండుజట్లూ ఆరుమ్యాచ్ ల్లో తలపడితే…చెరో మూడు మ్యాచ్ లూ నెగ్గి 3-3తో సమఉజ్జీలుగా ఉన్నాయి.

2012 పూనే, 2017 నాగపూర్, 2017 బెంగళూరు మ్యాచ్ ల్లో భారత్ పై ఇంగ్లండ్ జట్టే పైచేయి సాధించింది.2011 కోల్ కతా, 2012 ముంబై, 2017 కాన్పూర్ టీ-20 మ్యాచ్ ల్లో భారత్ విజేతగా నిలిచింది.

Also Read : భారత క్రికెట్లో ప్రతిభావంతుల అతివృష్టి

ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ తో ఆరుసార్లు తలపడిన భారత్ రెండంటే రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. 2018 సిరీస్ లో భాగంగా మాంచెస్టర్, బ్రిస్టల్ వేదికలుగా జరిగిన మ్యాచ్ ల్లో నెగ్గిన భారతజట్టు…2009 లార్డ్స్, 2011 మాంచెస్టర్, 2014 బర్మింగ్ హామ్, 2018 కార్డిఫ్ మ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసింది.

Everything is ready for the battle of India with England in t 20 series

అహ్మదాబాద్ వేదికగా పాంచ్ పటాకా

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మార్చి 12, 14, 16, 18, 20 తేదీలలో మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు జరుగనున్నాయి. కోవిడ్ కారణంగా.. మోతేరా బయోబబుల్ వాతావరణంలోనే మొత్తం ఐదుమ్యాచ్ లూ ఒకే వేదికలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మ్యాచ్ జరిగే తేదీలలో రాత్రి 7 గంటల కు టీ-20 సందడి ప్రారంభంకానుంది.

Also Read : విజయ్ హజారే టోర్నీలో కుర్రోళ్ల జోరు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles