Sunday, December 22, 2024

సర్వం బ్రహ్మమే

భగవద్గీత 19

మనకు కనపడుతున్న ప్రతీది నశించేదే! ‘‘యద్దృశ్యం తన్నశ్యమ్‌‘‘ అని దేవీ భాగవతం చెపుతున్నది. మరి సైన్సుకూడా ఇదేవిషయాన్ని ధృవీకరిస్తున్నది.

ఈ నక్షత్రాలు, గ్రహాలు, సమస్త తారామండలం అంతా నశించి అనంతశక్తి కేంద్రాలయిన కృష్ణబిలాలుగా (black holes) మారిపోతాయి. మరి అప్పుడు ఈ సృష్టిలో ఏమీ ఉండదా? ఉంటుంది. అనంత శక్తి. ఇవన్నీ నశించినవి అంటే అవి ఎప్పుడో ఒకప్పుడు పుట్టినట్లే కదా!

ఎక్కడనుండి పుట్టినవి? అనంతమయిన శక్తినుండి. నశించి అనగా చనిపోయి ఏమయినవి? అనంతశక్తిగా మారినవి. ఈ అనంత శక్తినే బ్రహ్మము లేక ఆత్మ అని అంటారు!

Also read: ఎవరు పండితుడు?

అసలు సృష్టి ఎలా జరిగిందట?

మొదట ఆకాశము. దానినుండి వాయువు, దానినుండి అగ్ని, దానినుండి ద్రవము (జలము), దానినుండి భూమి, భూమినుండి సకల ఓషధులు (చెట్టు చేమలు), దానినుండి అన్నము, దానినుండి జంతుజాలము ఈ విధంగా మొత్తము సృష్టి జరిగింది!

‘‘ఆకాశాద్వాయుః వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః

పృధివీ పృధివ్యాఓషధయః ఓషధిభ్యో అన్నమ్‌ అన్నాత్పురుషః.“ ఇలాగ ఉపనిషత్తు చెపుతుంది.

మరి మన ఆధునిక ఖగోళవిజ్ఞానం ఏం చెపుతున్నది?

Also read: కోట్ల కణాల కుప్ప మానవ శరీరం

ఆకాశంలో అధికసాంద్రత, అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర బ్రహ్మాండమైన విస్ఫోటనం జరిగి మొదట వేడి వాయువులుగా, ఆ తరువాత ద్రవరూపంలోకిమారి క్రమంగా చల్లారి ఘనరూపంలోకిమారి ఎన్నో ఖగోళ వస్తువులుగా అంటే నక్షత్రాలు, గ్రహాలుగా రూపాంతరం చెందినవి అని చెపుతున్నది.

పదార్ధానికి నాలుగు స్థితులు అని చదువుకున్నాం కదా! ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా (ionic state). ఇదే కదా ఉపనిషత్తు కూడా చెప్పినది? అంటే ఒక బ్రహ్మాండమైన శక్తి తనంత తానుగా ఇన్ని రూపాలు ధరించినట్లేగదా? అంటే మొత్తము బ్రహ్మమే కదా? బ్రహ్మము, ఆత్మ (రెండూ ఒకటే) కానిది ఏదీ లేదనేకదా చెపుతున్నది! అంటే it has made itself, from itself, by itself అనేకదా అర్ధం!

ఇదే విషయాన్ని పరమాత్మ చెపుతున్నారు.

బ్రహ్మార్పణమ్‌ బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్‌

బ్రహ్మైవ తేన గంతవ్యమ్‌ బ్రహ్మకర్మ సమాధినాః

యజ్ఞం చేసే వాడు బ్రహ్మం, యజ్ఞ సామాగ్రి బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, పొందే ఫలము కూడా బ్రహ్మమే! బ్రహ్మమునుండి వేరైనది ఏమయినా ఉందా?

ఇది ఇంకా అర్ధం కాకపోతే చిన్న ఉదాహరణ. సముద్రం బ్రహ్మం అనుకుందాం. దానిలొని నీటి బిందువులు ఖగోళవస్తువులు, మన భూమి దాని మీద ఉన్న సృష్టితో సహా! ఇప్పుడు సముద్రపు నీటి చుక్కలకు ,అంటే వాటి రుచికి రసాయన ధర్మాలకు సముద్రానికి ఏమయినా తేడా ఉన్నదా? లేదుకదా. అంతా సముద్రంలో భాగమేకదా!

గణిత పరిభాషలో చెప్పాలంటే universel set అనేకదా! దానిలోనే అన్నీ వచ్చేస్తాయి. Uni అంటే ఒకటి vers అంటే చాలా. అంటే ఒకటే (బ్రహ్మము)తనని తాను ’’ చాలా ’’ (many) గా మార్చుకుంది!

Also read: కర్తను తానే అంటాడు భగవంతుడు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles